“ఆదిపురుష్” సినిమాలో “ప్రభాస్” కంటే ముందుగా అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

“ఆదిపురుష్” సినిమాలో “ప్రభాస్” కంటే ముందుగా అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంలో తొలిసారి రాముడి పాత్రలో నటించారు. అందువల్ల ప్రభాస్  అభిమానులు ఆదిపురుష్ చిత్రం కోసం ఈగర్‏గా ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సీతగా కృతి సనన్ నటించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీ పై అంచనాలను పెరిగాయి. అయితే ఈ చిత్రంలో హీరోగా ముందుగా అనుకున్నది ప్రభాస్ ని  కాదంట. మరి ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో చూద్దాం..
బాలీవుడ్ లో తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ ఆదిపురూష్ సినిమాని  రూపొందించాడు. దాంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. అది మాత్రమే కాకుండా ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడంతో ఆడియెన్స్, అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.  అయితే ఆ మధ్యన రిలీజ్ అయిన మూవీ టీజర్ ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను నిరాశ పరిచింది. కారణం క్యారెక్టర్స్ లుక్స్, గ్రాఫిక్స్.
మరి ముఖ్యంగా రావణుడు, హానుమాన్ రూపాలను చూడగానే ఆంగ్ల చిత్రాలను చూసినట్టుగా ఉందని విమర్శలు వచ్చాయి. రాముడు, సీత, పాత్రలను అవమానించారంటూ మూవీ యూనిట్ పై విమర్శలు చేశారు. దీంతో మూవీ యూనిట్ సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాని జూన్ 16కు వాయిదా వేసింది. గ్రాఫిక్స్ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆ మార్పు అర్ధం అవుతోంది. ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కన్నా ముందుగా డైరెక్టర్ ఓంరౌత్ బాలీవుడ్ స్టార్ హీరోను రాముడిగా అనుకున్నారంట. దర్శకుడు ఓం రౌత్ ముందుగా హృతిక్ రోషన్ కథ చెప్పారట, దానికి హృతిక్ ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పాడట. చివరకు ప్రభాస్‌ కు కథ చెప్పడం  ఆయన ఒప్పుకోవడం జరిగింది.

Also Read: “విజయ్ దేవరకొండ” కొత్త సినిమా పోస్టర్ పై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

 


End of Article

You may also like