టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా విభిన్న కథలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలో మంచి హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Video Advertisement

 

 

ప్రతిష్టాత్మక స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో అల్లు శిరీష్ హీరోగా రాబోయే చిత్రమే బడ్డీ. ఈరోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్ప్స్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

did you know who is the first choice for allu sirish buddy movie..!!

 

ఇక గ్లింప్స్ వీడియో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను రేకెత్తిస్తుంది. 2:37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో లో టెడ్డి ను చంపే ప్రయత్నం చేసే ఒక బ్యాచ్ , టెడ్డీని సంరక్షించే పాత్రలో శిరీష్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ అదిరిపోయాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా బాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాకు ఇది మెయిన్ ప్లస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.

did you know who is the first choice for allu sirish buddy movie..!!

అయితే ఈ చిత్రాన్ని గతంలో హీరో సందీప్ కిషన్ చేస్తున్నట్లుగా ఒక పోస్టర్ కూడా వచ్చింది. 2023 సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ తమ కంటెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అందులో సందీప్ కిషన్ హీరోగా ‘బడ్డీ’ సినిమాను కూడా ప్రకటించారు.‘మైఖేల్’ విడుదల అయ్యాక దీని టీజర్ కూడా వస్తుందని తెలిపారు. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా ఆగిపోయింది.

did you know who is the first choice for allu sirish buddy movie..!!

ఇప్పుడు దాన్ని తిరిగి అల్లు శిరీష్‌తో అనౌన్స్ చేసారు. ఈ మూవీని తమిళ దర్శకుడు శామ్ ఆంటోన్ తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్ ఆర్య గతంలో నటించిన ‘టెడ్డీ’ తరహాలో ఉంది. కానీ ఈ సినిమా రీమేక్ కాదని అల్లు శిరీష్ తెలిపారు. అప్పట్లో ‘టెడ్డీవర్స్’లో ఈ సినిమా జరుగుతుందని ప్రకటించారు. మరి కథలో ఏమైనా మార్పులు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

Also read: ఈ 16 హీరోలు… “మేకప్” లేకుండా ఎలా ఉంటారో చూశారా..?