రైలు ప్రయాణాలు మనకి కొత్తేమి కాదు. ఎంతో హుషారు గా కిటికీ పక్కన కూర్చుని రైల్లో వెళ్ళడానికి మనందరం ఇష్టపడతాం. అదే సమయం లో రైలు పట్టాలకు పక్కాగా ఓ అల్యూమినియం బాక్స్ ఉంటుంది. దీనిని ఎప్పుడైనా గమనించారా..? ఈ బాక్స్ లు ఏమిటి..? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

alyuminium box

మనం రోబో సినిమా చూసాం కదా. అందులో రోబోట్ ట్రైన్ లో ఫైట్ చేస్తున్న సమయం లో ఛార్జ్ అయిపోతుంది. అదే టైం లో రైలు పట్టాల పక్కన పడిపోయిన రోబో అల్యూమినియం బాక్స్ లో నుంచి ఓ వైర్ ను తీసుకుని ఛార్జింగ్ పెట్టుకున్నట్లు చూపిస్తారు. సినిమా కోసం ఈ బాక్స్ ని అలా వాడినప్పటికీ.. అసలు ఈ బాక్స్ లను వేరే అవసరం కోసం పెట్టారు. ఈ అల్యూమినియం బాక్స్ లను ఆక్సిల్ కౌంటర్లు అంటారు. ఇందులో కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. ఇవి వచ్చి పోయే రైళ్ల సమాచారాన్ని రైల్వే డిపార్ట్మెంట్ కు అందిస్తాయి. రైలు పట్టాలకు పక్కాగా.. ప్రతి ఐదు, ఆరు కిలోమీటర్లకు ఒక చోట ఈ బాక్స్ లను ఏర్పాటు చేస్తారు. వీటిని లొకేషన్ బాక్స్ లు అని కూడా పిలుస్తారు.

robot scene

ఈ బాక్స్ లు వచ్చి పోయే రైళ్ల సమాచారాన్ని గుర్తించగలుగుతాయి. ఇవి ఎలా పని చేస్తాయో ఓ సారి చూద్దాం. ఈ అల్యూమినియం బాక్స్ లను తెరిచి చూస్తే, అందులో ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ కు రైలు పట్టాల మధ్య ఉండే మరో డివైస్ తో వై-ఫై కనెక్షన్ ను కలిగి ఉంటుంది. రైలు పట్టాల మధ్య ఉండే డివైస్ పట్టాల మీదనుంచి రైళ్లు వెళ్ళినపుడు ఆ రైలు కు ఎన్ని బోగీలు ఉన్నాయో గుర్తిస్తుంది. సాధారణం గా రైలు చక్రాలకు మధ్య ఆక్సిల్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క బోగీకి నాలుగు ఆక్సిల్స్ ఉంటాయి. ఈ లెక్కన ఒక రైలు కు పది బోగీలు ఉన్నాయనుకుంటే.. ఆ రైలు కు నలభై ఆక్సిల్స్ ఉన్నాయని అర్ధం.

railway tracks

రైలు పట్టాలకు అమర్చబడిన డివైస్ లు ఈ ఆక్సిల్స్ ను కౌంట్ చేసి, ఆ సమాచారాన్ని లొకేషన్ బాక్స్ కు పంపిస్తుంది. ఈ ఆక్సిల్స్ ను బట్టి ఎన్ని బోగీల రైలు పట్టాల మీద నుంచి వెళ్ళింది అనే సమాచారాన్ని ఈ అల్యూమినియం బాక్స్ సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని.. మరో ఐదు, ఆరు కిలోమీటర్ల దూరం లో ఉన్న అల్యూమినియం బాక్స్ కి పంపిస్తుంది.

ఆ అల్యూమినియం బాక్స్ కూడా ఇదే విధం గా ఎన్ని బోగీలు వెళ్ళాయో సమాచారం సేకరిస్తుంది. ఒకవేళ రావాల్సిన బోగీల కంటే తక్కువ బోగీలు వస్తే.. వెంటనే ఈ సమాచారం రైల్వే అధికారులకు వెళ్ళిపోతుంది. వెంటనే వారు, ఏ రైలు కు బోగి మిస్ అయిందో గుర్తించి ఆ రైలుని తరువాత స్టేషన్ లో ఆపివేస్తారు. క్షేత్ర పర్యటన చేసి సమస్య ఎక్కడ ఉందొ తెలుసుకుని పరిష్కరిస్తారు.

 

అన్ని రైళ్లను భద్రం గా నడపడం కోసమే.. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ లొకేషన్ బాక్స్ ల వ్యవస్థ రైలు ప్రమాదాలను గుర్తించడం లో రైల్వే అధికారులకు ఎంతగానో సాయం చేస్తుంది.