భలే మోసం చేశారుగా.. “పుష్ప” సినిమాలో ఈ సీన్లు గమనించారా? అంటే షూటింగ్ చేసేటప్పుడు..?

భలే మోసం చేశారుగా.. “పుష్ప” సినిమాలో ఈ సీన్లు గమనించారా? అంటే షూటింగ్ చేసేటప్పుడు..?

by Anudeep

Ads

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే.

Video Advertisement

పుష్ప చిత్రం బాహుబలి తర్వాత మన తెలుగు వారి సత్తా ఏమిటో మరోసారి దేశవ్యాప్తంగా చాటిచెప్పింది.  దర్శకుడు సుకుమార్ కి మరియు హీరో అల్లు అర్జున్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ని తెచ్చిపెట్టింది పుష్ప చిత్రం.

పుష్ప చిత్రంలో సన్నివేశాలు అన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. వెనుక బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ అదిరిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఇదంతా మన VFX మాయాజాలం అని మనలో చాలా మందికి తెలియదు. అంత సాధారణంగా కనిపిస్తుంది ప్రతి లొకేషన్.

పుష్ప చిత్రాలోని కొన్ని సన్నివేశాలు చిత్తూరులోని శేషాచల అడవుల్లో చిత్రీకరించారు. మరికొన్ని మారేడుమిల్లిలో చిత్రీకరించారు.  ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులను ఆకర్షించేలా చేశారు. ఇంతకీ ఈ చిత్రం లో ఏది వర్జినల్ లో, ఏది vfx ఎఫెక్ట్స్ ఒకసారి చూసేద్దాం రండి.

#1. శ్రీవల్లి సాంగ్ లో :

శ్రీవల్లి పాటలు అల్లు అర్జున్ చేసే సిగ్నేచర్ స్టెప్స్ అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా మటుకు ఈ స్టెప్ ని అనువదించకుండా  ఎవ్వరూ లేరు. సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించి అనేక వీడియోలు హల్చల్ చేశాయి. ఖాళీ కొండపైన  చేసిన  ఈ వీడియోను విజువల్ ఎఫెక్ట్స్ తో చిత్ర యూనిట్ ఎలా మార్చి వేశారు  మీరు గమనించవచ్చు.

#2. లారీ చేసింగ్ సీన్ :

అల్లు అర్జున్ చేసిన లారీ చేసింగ్ సీన్ సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పవచ్చు. అసలు ఈ సీన్లో నిజంగా లారీనే లేదు. ఒక ట్రాలీ పై లారీ ముందుభాగం క్యాబిన్ లా డోర్ వరకు సెట్ వేశారు. ఈ సైట్ ని Vfx ఎఫెక్ట్స్  ద్వారా ఈ విధంగా చేంజ్ చేశారు.

#3. చందనం దుంగలు నదిలో వదిలే సీన్ :

ఈ సన్నివేశం అసలుకు మారేడుమిల్లిలో జరిగింది. ఎర్రచందనాన్ని పోలీసుల నుండి రక్షించేందుకు నదిలో పడే ఈ సన్నివేశంలో రియల్ గా వెనక బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. Vfx ఎఫెక్ట్స్ తో దానిని కొండలుగా చిత్రీకరించారు.

#4. ఎర్ర చందనాన్ని తప్పించి ఆలోచనలో ఉన్నా సీన్ :

ఎర్రచందనం గురించి పోలీసులు జాడ తెలుసుకొని వస్తుండగా,  ఎలా తప్పించాలి అనుకున్న సీన్లో అక్కడ ఎలాంటి అడవి ఉండదు. Vfx ఎఫెక్ట్స్ మాయాజాలంతో దానిని దట్టమైన అడవిలా చిత్రీకరించారు. ఇలా కొన్ని సన్నివేశాల్లో ఎఫెక్ట్స్ వాడటం ద్వారా టోటల్ గా చిత్రానికి  అదిరిపోయే ఔట్పుట్ వచ్చిందని చెప్పవచ్చు.


End of Article

You may also like