ఇండస్ట్రీ లో ఎందరో హీరోలు ఉన్నారు. వారిని అభిమానించే ఫాన్స్ లక్షల్లో ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో మరే ఇతర స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ సొంతం. వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ ఐనా.. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ ఏంటో చెప్పాలంటే.. అంత ఈజీ కాదు. జస్ట్ అలా తెరమీద కనిపిస్తే చాలు ఊగిపోతుంటారు ఫ్యాన్స్. ఆ అభిమానం అలాంటిది. మాములుగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ.. హీరోలనే ఫ్యాన్స్‌గా ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్.

Video Advertisement

పవన్ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లోప్స్ సంఖ్యే ఎక్కువ. కానీ వాటితో సంబంధం లేకుండా ఆయన్ని అభిమానించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే ఇండస్ట్రీ లో ఒక ఫార్ములా ఒక దగ్గర హిట్ అవ్వొచ్చు.. అదే ఫార్ములా మరో చోట ఫ్లాప్ కావచ్చు. అలాగే ఒకే కథతో తీసిన రెండు చిత్రాల్లో ఒక మూవీ హిట్ కాగా.. మరోటి ప్లాప్ అయ్యాయి. ఆ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

did you notice these two movie has same story..

కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బాలు సినిమా వచ్చింది. ఈ చిత్రం లో శ్రీయ, నేహా ఒబెరాయ్ హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ అప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇదే స్టోరీ తో మూవీ తీసి హిట్ కొట్టాడు మాస్ మహారాజ రవితేజ. వరుసగా 7 సినిమాలు ప్లాప్ కావడంతో రవి తేజ సినీ కెరీర్ డైలమా లో ఉన్న సమయం లో బలుపు మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు రవితేజ.

గోపీచంద్ మలినేని తెరకెక్కించిన బలుపు మూవీ లో అంజలి, శృతి హాసన్ హీరోయిన్లు గా నటించారు. ఈ చిత్రం సుమారు 29 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ మూవీ కి దర్శకుడు బాబీ స్టోరీ ని అందించారు. అయితే బలుపు సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ బాలు సినిమాను పోలే ఉంటాయి. ఈ రెండు మూవీస్ లో ఫ్లాష్ బ్యాక్ ఒకే లాగా ఉంటుంది. అలాగే రెండు సినిమాల్లో హీరోయిన్ చనిపోతుంది.

ఈ రెండు చిత్రాల్లో బాలు సినిమా పెద్దగా ఆడలేదు. కానీ బలుపు మాత్రం సూపర్ హిట్ అయింది. బాలు సినిమా రైటర్ కోన వెంకటే ఇక బలుపు సినిమాకి కూడా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడం గమనార్హం. ఈ రెండు చిత్రాల కథలు ఒకటే అయ్యాయి కానీ.. దర్శకుడి టేకింగ్.. స్టోరీ నేరేషన్ వల్ల రెండు చిత్రాలకు భిన్న ఫలితాలు వచ్చాయి.