పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని రెట్టింపు చేస్తూ అభిమానుల గుండెల్లో నాటుకుపోయేలా చేసిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతం గా పెరిగిపోయింది. ఆ తర్వాత పదేళ్లు పవన్ కి సరైన హిట్ లేకపోయినా ఆయన క్రేజ్ చెక్కుచెదరలేదు. అప్పటికే ఐదు బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో జోరుమీదున్న పవన్‌కు ఈ సినిమా డబుల్‌ హ్యట్రిక్‌గా నిలిచింది. పవన్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌, హేయిర్‌ స్టైల్‌ అప్పట్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో పవన్‌-భూమిక కెమిస్ట్రీకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.

Video Advertisement

ఖుషి బ్యాక్ స్టోరీ విషయానికొస్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్, జ్యోతిక జంటగా ఎస్‌జే సూర్య మొదట తమిళ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్కడ సక్సెస్ కావడంతో తెలుగులో ఆయనే పవన్‌తో తీశారు. దర్శకుడు ఎస్‌.జే సూర్య తెలుగు నేటివిటీ కి , పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేసారు. అలాగే మణిశర్మ ఇచ్చిన ఆల్బమ్ సూపర్ హిట్ గా నిలిచింది.

did you notice this in pavan kalyan khushi movie..

అయితే ఖుషి సినిమాలో ఒక సీన్ లో ఒక తప్పు ఉంది. ఖుషి సినిమా ఫస్ట్ విజయ్ హీరోగా తమిళ్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ కి ఆక్సిడెంట్ అవుతుంది. ఆ సీన్ లో సేమ్ తమిళ్ సినిమాలో ఉన్న విజువల్స్ వాడారు. అందులో మనకి తలపతి విజయ్ నే కనిపిస్తాడు. ఆ సినిమాలో విజయ్ ప్యాసింజర్ సీట్ లో కూర్చొని ఉంటాడు. తెలుగు సినిమాలో కూడా మనకి ఆ షాట్స్ నే చూపించారు. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియో ని చుసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. భలే మోసం చేసావ్ కదా ఎస్‌.జే సూర్య అంటూ కామెంట్స్ చేస్తూ ఈ వీడియో ని వైరల్ చేస్తున్నారు.

did you notice this in pavan kalyan khushi movie..

మరోవైపు ఖుషి రీ రిలీజ్ సందర్భంగా మొదటి రోజు నాలుగున్నరకోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెండో రోజున కోటిన్నరకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. ఇంతకు ముందు వచ్చిన జల్సా సినిమా 2.57 కోట్లను అందుకుంది. ఇలా చూసుకున్నా రీ రిలీజ్లలో కూడా పవన్ హవానే నడుస్తోంది. ఏపీలోని కొన్ని ఏరియాల్లో లా అండ్ ఆర్డర్ సమస్యల పేరుతో ‘ఖుషి’ రీ రిలీజ్ చేయడానికి అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ అనుమతులు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేది అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

video: