స్టార్ హీరోయిన్స్ అయిన కీర్తి సురేష్, సాయి పల్లవి , కృతిశెట్టి, మృణాల్ ఠాకూర్ లు తమదైన నటన, అందంతో వరుస సినిమాలతో తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అయితే ఈ నలుగురు స్టార్ హీరోయిన్స్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది.. అదేంటో తెలుసా..??

Video Advertisement

కీర్తి సురేష్ తెలుగులో హీరో రామ్ తో తన మొదటి సినిమా ‘నేను శైలజ’ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే సాయి పల్లవి తెలుగులో తన మొదటి సినిమా ‘ఫిదా ‘ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. అలాగే కృతి శెట్టి, మృణాల్ ఠాకూర్ కూడా ఉప్పెన, సీతారామం మూవీస్ తో సూపర్ హిట్స్ కొట్టారు.

did you notice this common point in these 4 heroines..!!

అయితే ఈ నలుగురు హీరోయిన్లు తెలుగులో తమ రెండో చిత్రాన్ని నాని తోనే చేశారన్న విషయం మీరు గమనించారా..?? వైవిధ్యమైన కథల ఎంపిక, తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. అలాగే నాని తన మూవీస్ లో కొత్త హీరోయిన్లను , టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు.

did you notice this common point in these 4 heroines..!!

అలాగే కీర్తి సురేష్ తో ‘నేను లోకల్’, కృతిశెట్టి తో ‘శ్యామ్ సింగ రాయ్’, సాయి పల్లవి తో ‘ఎంసిఏ’ మూవీస్ చేసారు. ఈ చిత్రాలు కూడా ఆ హీరోయిన్స్ మొదటి మూవీ లాగే సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్నాయి. అలాగే ప్రస్తుతం మృణాల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు.

did you notice this common point in these 4 heroines..!!

ఇక నాని తాజాగా దసరా మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్. మార్చి 30న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే రూ. 38 కోట్లు వసూలు చేసి నాని కెరీర్లోనే డే 1 హైయెస్ట్ గ్రాసర్ గా ఈ మూవీ నిలిచింది.