కరెన్సీ నోట్ల పై ఈ గీతలు ఎప్పుడైనా గమయించారా.? అవి ఎందుకు ఉంటాయో తెలుసా.?

కరెన్సీ నోట్ల పై ఈ గీతలు ఎప్పుడైనా గమయించారా.? అవి ఎందుకు ఉంటాయో తెలుసా.?

by Mohana Priya

Ads

ఒక మనిషి బయటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఉండే వస్తువులలో డబ్బులు ఒకటి. అసలు డబ్బు లేకుండా ప్రపంచమే ముందుకు నడవదు. మనం మనం ఖర్చు పెట్టినా, పెట్టకపోయినా మనకి డబ్బు అవసరం ఉన్నా, లేకపోయినా కానీ మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డబ్బులు మన దగ్గర ఉంచుకుంటాం.

Video Advertisement

Reason began having lines on the currency note

ఒక్క రోజు ఒక మనిషి డబ్బులు లేకుండా బయటకు వెళితే, అక్కడ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తే ఎలా అనే ఆలోచనే ఉంచుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే ప్రతి మనిషి కచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు తమ దగ్గర ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని వెళ్తారు. అందులోనూ ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించే వారి దగ్గర అయితే 50, 10, 20, 100 రూపాయల నోట్లు, అలాగే కొంచెం చిల్లర కచ్చితంగా ఉంటాయి.

Reason began having lines on the currency note

అయితే మనం నోట్లని ఉపయోగిస్తాంలే కానీ అంత పరిశీలించి చూడము. ఒక వేళ చూసినా కూడా దాని మీద ఉన్న కొన్నిటికి అర్థం తెలియదు. నోట్లపై ఉండే డిజైన్లు మనమందరం గమనించే ఉంటాం. అయితే ఆ డిజైన్ మనకి కేవలం డిజైన్ మాత్రమే కావచ్చు. కానీ ఆ నోటు మీద ఉండే చిన్న గీతల వెనకాల కూడా అర్థం ఉంటుంది.

Reason began having lines on the currency note

అయితే, కరెన్సీ నోటుకి కుడి వైపు, ఎడమ వైపు సన్నని గీతలు ఉంటాయి. ఆ గీతల వెనకాల ఉన్న అర్థం మనలో చాలా మందికి తెలియదు. ఆ గీతలు అంధులకి అర్థం కావడానికి ఉండే లాగా రూపొందించారు. 2000 రూపాయల నోటు మీద 7 గీతలు ఉంటాయి. 500 రూపాయల నోటు మీద 5 గీతలు ఉంటాయి.

Reason began having lines on the currency note

200 రూపాయల నోటు మీద అయితే పైన 2 గీతలు, కింద 2 గీతలు మధ్యలో 2 చుక్కలు ఉంటాయి. 100 రూపాయల నోటు మీద 4 గీతలు ఉంటాయి. ఆ లైన్లను తాకి ఆ నోట్ ఎన్ని రూపాయలది అనేది వారు గుర్తిస్తారు. అయితే పాత నోట్లకి కూడా అన్నిటికీ గీతలు కాకపోయినా ఒక పాటర్న్  లాంటిది ఉండేది. ఆ పాటర్న్ ద్వారా ఆ నోటు ఎన్ని రూపాయలది అనేది తెలుసుకుంటారు.

source :


End of Article

You may also like