సైలెంట్ గా వచ్చి డీసెంట్ గా హిట్ కొట్టిన సినిమా ‘సీతా రామం’. అద్భుతమైన కథతో పాటు హను రాఘవపూడి టేకింగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్, రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు.

Video Advertisement

హీరోయిన్ రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటి వరకు థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో అందరికి చేరువైంది.

did you these scenes in seetaraamam' movie
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం లో ఉన్న కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన ఒక వెంకటేష్ చిత్రంలోని సన్నివేశాల్లాగే ఉన్నాయంటూ ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అదే వెంకటేష్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘మల్లీశ్వరి’. ఈ చిత్రం అప్పట్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీనిలో కామెడీ సన్నివేశాలు, వెంకటేష్ టైమింగ్ అన్ని ఇప్పటికి కూడా ప్రేక్షకులకు ఫేవరేట్.

did you these scenes in seetaraamam' movie
ఇందులో వెంకటేష్, కత్రినా కైఫ్ తో మాట్లాడేటపుడు తన జీతం గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే సీతారామం చిత్రం లో కూడా రామ్ ఒక సన్ని వేశంలో సీత తో ఇలాంటి డైలాగ్ మాట్లాడే సన్నివేశం ఒకటి ఉంది. అలాగే ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్లు రాజ వంశానికి చెందిన వారు.. అంటూ ఆ వీడియోలో ఉంది. అలాగే ఈ రెండు చిత్రాల్లో ఒకేలా ఉన్న కొన్ని సీన్లను ఎడిట్ చేసి..ఈ వీడియోలో పెట్టారు.

did you these scenes in seetaraamam' movie
దీంతో ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. అరే ..ఈ సీన్లు ఎక్కడో చూసినట్టు ఉన్నాయే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘సీతారామం’ చిత్రం ఇండియాలో నంబర్ 1  గా ట్రెండింగ్ లో ఉంది. ముప్పై కోట్ల వ్యయం తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎనభై కోట్లు వసూలు చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

watch video :