ఈ నాలుగు సినిమాలలో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

ఈ నాలుగు సినిమాలలో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

by Anudeep

Ads

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. క్రియేటివిటీకి పర్ఫెక్ట్ ప్లేస్. అయితే.. ఒకే రకమైన కాన్సెప్ట్ లు అన్ని సినిమాలలోనూ రిపీట్ అవుతుంటే మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టేయక మానదు. కాన్సెప్ట్ ఒకటే అయినా.. దానిని మనం ఎంత కొత్తగా చూపిస్తాం అన్న దానిపై సినిమా భవిష్యత్ ఆధార పడి ఉంటుంది.

Video Advertisement

ఎంత కొత్తగా తీసినప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు ఒకేలాంటి కాన్సెప్ట్ సినిమాలలో రిపీట్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాలుగు సినిమాల్లో కూడా ఒకటే కాన్సెప్ట్ రిపీట్ అయ్యింది.

common point

ఇంతకీ ఆ నాలుగు సినిమాలు ఏంటో చూద్దాం. నాగచైతన్య, సునీల్ నటించిన తడాఖా సినిమా, వెంకటేష్ – మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాని నటించిన ఎంసీఏ, వరుణ్ తేజ్ ఫిదా సినిమాలు. ఈ సినిమా స్టోరీలు అన్నీ డిఫరెంట్ కదా.. కామన్ పాయింట్ ఏమి ఉంది అని ఆలోచిస్తున్నారా? అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

common point 1

ఈ నాలుగు సినిమాల్లోనూ అన్నదమ్ముళ్లు ఉంటారు. తమ్ముడిగా నటించిన హీరోలు తమ అన్న పెళ్లి చేసుకున్న అమ్మాయి చెల్లెలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తడాఖాలో నాగచైతన్య తమన్నాని, ఎంసీఏ లో నాని భూమిక సిస్టర్ గా నటించిన సాయి పల్లవిని, అలాగే వరుణ్ తేజ్ కూడా ఫిదా సినిమాలో చెల్లెలి క్యారెక్టర్ చేసిన సాయి పల్లవిని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలి సిస్టర్ సమంతని మహేష్ బాబు ప్రేమిస్తారు.


End of Article

You may also like