కామెడీ అండ్ యాక్షన్ మిక్సింగ్  కంటెంట్ తో  సినిమాలతో  సక్సెస్ సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్, సుప్రీమ్, సరిలేరు నీకెవ్వరు, f2 సినిమాలతో సక్సెస్ సాధించి స్టార్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి.

Video Advertisement

ఈయన ప్రత్యేకత ఏంటంటే ఒక చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్ ని, మరొక చిత్రంలో మెయిన్ హీరోయిన్ గాను, ఒక సినిమాలో హీరోయిన్ గా చేసినా వారిని మరొక సినిమాలో స్పెషల్ అప్పీరెన్స్ గా తీసుకుంటూ ఉంటారు . పటాస్ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన నటించిన శృతి సోదిని సుప్రీమ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ నటింపజేసేసారు.

అదేవిధంగా సుప్రీమ్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన  రాశి ఖన్నాను, అనిల్ రావిపూడి తర్వాత చిత్రమైనా రాజా ది గ్రేట్ చిత్రంలో రాశి ఖన్నాను స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ గా  తీసుకున్నారు.

ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ చిత్రంగా రూపొందిన F2 చిత్రంలోని విక్టరీ వెంకటేష్ సరసన తమన్నా భాటియా నటించారు. F2 చిత్రంలో నటించిన తమన్నాభాటియాను, అనిల్ రావిపూడి దర్శకత్వంలో స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయించారు.

Pooja hegde in f3

ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో F3 చిత్రం రానుంది. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో  పూజా హెగ్డే కనపడనుంది. ఇలా అనిల్ రావిపూడి తన చిత్రాల్లో నటించిన హీరోయిన్ ని స్పెషల్ సాంగ్ లోనూ, స్పెషల్ సాంగ్ లో వచ్చిన వారిని హీరోయిన్ గాను సెట్ చేస్తున్నాడు.

Bala krishna with anil rayapudi

అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో చేయబోయే తరువాత చిత్రంలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా పెట్టబోతున్నారు అనే విషయాన్ని వేచిచూడాలి.