నెల రోజుల క్రితం తమిళంలో విడుదలై పెట్టుబడికి 15 రెట్లు వసూలు చేసిన చిత్రం “లవ్ టుడే”. ప్యాడింగ్ గా సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు ఉన్నా మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే. పైగా “కాంతార” మాదిరిగా ఇక్కడ కూడా దర్శకుడు, హీరో ఒకడే.

Video Advertisement

నేటి యువతని టార్గెట్ చేసి ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించి తీసిన సినిమా ఇది. టైటిల్ కి తగ్గట్టుగా నేటి మొబైల్ ఫోన్, సొషల్ మీడియా ప్రేమలు, పెటాకులు, నేరాలు ఎలా ఉన్నాయో చూపిస్తూ అద్యంతం సరదాగా సాగే స్క్రీన్ ప్లే తో తీసిన న్యూ ఏజ్ సినిమా ఇది. దీంతో తెలుగులో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది ఈ చిత్రం.

memes goes viral on this scene from lovetoday movie..

ప్రస్తుత కాలం లో రొటీన్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆటోమెటిక్‌గా దూరం పెట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలో కంటెంట్ బావుంటే చాలు కాన్సెప్ట్ బావుంటే చాలు.. హీరోతో ప‌నే లేదు. సినిమాను ప్రేక్ష‌కులు చూసి హిట్ చేసేస్తున్నారు. అలాంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మే ‘లవ్ టుడే’. అలాగే ఎక్క‌డా సినిమాలో ప్రేమ వ్య‌వ‌హారాన్ని త‌ప్పు ప‌ట్టలేదు. ప్రేమికుల్లో ఒక‌రిపై మ‌రొకరికి ప్రేమ మాత్ర‌మే కాదు.. త‌మ ప్రేమ ప‌ట్ల న‌మ్మ‌కం ఉండాలి అనే సున్నిత‌మైన విష‌యాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేశారు.  ప్రేమికులు, పెళ్లి చేసుకోవాల‌నుకునేవారు సెల్‌ఫోన్స్ మాయ‌లో ప‌డి దూరాన్ని పెంచేసుకుంటున్నారు. అలా ఉండ‌కూడదు. ఎన్ని గొడ‌వ‌లు వ‌చ్చినా స‌ర్దుకుపోవాల‌ని చెప్పటానికి స‌త్య‌రాజ్ పాత్ర క్రియేట్ చేశారు.

memes goes viral on this scene from lovetoday movie..

అయితే తాజాగా ఈ చిత్రం లోని ఒక సన్నివేశం నెట్టింట వైరల్ గా మారింది. హీరో ప్రదీప్, హీరోయిన్ ఇవానా ఒక సందర్భం లో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటున్న సన్నివేశం లో.. హీరో చెవిలో ఇయర్ పోడ్స్ ఉన్నా కానీ.. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. దీంతో ఈ సీన్ చూసిన ప్రేక్షకులు.. చూసుకోవాలిగా డైరెక్టర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సన్నివేశం పై మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.