ఈ 2 “లోకేష్ కనకరాజ్” దర్శకత్వం వహించిన సినిమాల్లో… ఇది గమనించారా..?

ఈ 2 “లోకేష్ కనకరాజ్” దర్శకత్వం వహించిన సినిమాల్లో… ఇది గమనించారా..?

by Anudeep

Ads

సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది.కొంత మంది డైరెక్టర్లకి ఇష్టమైన నటులు ఉంటారు వారి కోసం ప్రత్యేకమైన పాత్రలు సృష్టిస్తుంటారు.

Video Advertisement

అదేవిధంగా తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి కూడా ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అది ఏంటి అంటే..  హీరో స్ధాయిలో విలన్ క్యారెక్టర్ లని చూపించడం ఈయన ప్రత్యేకత.

ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాకి ప్రస్తుతం తెలుగులో కూడా హిట్ టాక్ వస్తోంది.ఈ సినిమా చివరిలో చూస్తే సూర్య హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అని విక్రమ్ సినిమా చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది.ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తే సూర్య పాత్రని రోలెక్స్ అనే ఒక పాత్రగా పరిచయం చేస్తారు. సూర్య పాత్ర లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అర్జున్ దాస్ తో మాట్లాడుతూ ఉంటారు.

kamal haasan vikram hitlist review

లోకేష్ కెరీర్ లో బిగేస్ట్ హిట్ గా నిలిచిన ‘మాస్టర్’ సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్స్ లో,  జైల్ లో హీరో విజయ్ ఫైట్ జరుగుతుంటే, వేరొక చోట విలన్ కి వేరొకరితో ఫైట్ సీన్ ఉంటుంది. అలాగే ‘విక్రమ్’ సినిమాలో కూడా ఇంటర్వెల్ కి  ముందు కమల్ ఫైట్ సీన్ తో పాటు , వేరే చోట విలన్ మరొకరితో పోరాడే సన్నివేశాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే ఈ రెండు సినిమాల్లో ఆ రెండు ఫైట్ సీక్వెన్స్ లలో హీరో ఫైట్స్ కంటే, విలన్స్ చేసే ఫైట్స్ ప్రేక్షకుల్ని ఎక్కువ ఉర్రూతలూగిస్తాయి అని చెప్పుకోవచ్చు.

ఆ రెండు సినిమాల్లో హీరోలకి మించి, ఫైట్ చేసి ప్రేక్షకుల్ని అబ్బురపరచిన విలన్ ఒక్కరే కావడం, అది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కావడం ఇక్కడ కొసమెరుపు. మాస్టర్, విక్రమ్ ఈ రెండు సినిమాల్లో విజయ్ సేతుపతి చేసిన పోరాట సన్నివేశాలు ఆ సినిమాల్ని మరొక స్ధాయిలో నిలిపాయి. విజయ్ సేతుపతికి హీరోలతో సమానమైన పేరు తెచ్చిపెట్టాయి. అందుకే ఇపుడు తమిళ తంబీలు లోకేష్ దర్శకత్వంలోని సినిమాల్లో విజయ్ సేతుపతి హీరో లాంటి విలన్ అనుకుంటున్నారు.


End of Article

You may also like