మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో ఓ సినిమాలో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

 

వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దేవి కంపోస్ చేసిన ‘బాస్ పార్టీ’ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన శ్రీ దేవి చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ చిత్రం నుంచి నాలుగో పాట నిన్న రిలీజ్ చేసారు. ‘పూనకాలు లోడింగ్’ అంటూ సాగే ఈ సాంగ్ లో రవితేజ, చిరంజీవి కలిసి స్టెప్పులేశారు.

did chiru and wore the same shirts..??

ఇక తాజాగా ఈ సినిమాలోని ‘పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. అలాగే ఈ పాటలో చిరు, రవితేజ డాన్స్ హైలైట్.

did chiru and wore the same shirts..??

అయితే ఈ సాంగ్ లో చిరు వేసుకున్న షర్ట్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో చిరు ఎరుపు రంగు షర్ట్ ధరించి మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. అయితే గతం లో రామ్ చరణ్ ఓ యాడ్ లో కూడా సేమ్ ఇలాంటి షర్ట్ నే వేసుకున్నాడు. దీంతో చిరు వేసిన షర్ట్ చరణ్ డి అంటూ నెట్టింట ఆ ఫోటోలని షేర్ చేస్తున్నారు. ఒకేలాంటి డిజైన్ ఉన్న షర్ట్స్ లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కనిపించడం తో మెగా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.