Ads
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం లైగర్. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా చిత్రం. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
Video Advertisement
2019 లోనే ఈ చిత్రాన్ని చేయబోతున్నమంటూ ప్రకటించిన గత రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం పట్టాలెక్కలేదు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. లైగర్ చిత్రానికిగాను పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.
లైగర్ చిత్రానికి సంబంధించిన ఈ మధ్య విడుదలైన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో ఎంతో హల్ చల్ చేసింది. గులాబీ పూలు పట్టుకుని నిలుచున్నాడు విజయ్ దేవరకొండ. అసలు ఇలాంటి పోస్టర్ ఎలా విడుదల చేశారు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురయ్యింది అనే విషయం తెలిసినదే. ఇప్పుడు అదేవిధంగా లైగర్ చిత్రం నుంచి ఆక్డి పక్డి పాట సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పాట చూస్తుంటే ఎక్కడో కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది కదూ..అసలు కథ ఏమిటంటే ఈ చిత్రంలోని పాట చూసిన నెటిజన్లు అచ్చు రెండు చిత్రాల నుంచి మ్యూజిక్, స్టెప్స్ కాఫీ కొట్టేసినట్లుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏ ఏ చిత్రాల నుంచి అబ్బా.. అనుకుంటున్నారా..
పరశురామ్ దర్శకత్వంలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట చిత్రంలోని మా మా మహేషా పాటలోని స్టెప్స్ ని, అదేవిధంగా మన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంలోని టైటిల్ సాంగ్ జై బాలయ్య నుంచి మ్యూజిక్ కూడా కాఫీ కొట్టేసినట్లుంది అంటూ నెటిజన్లు లైగర్ చిత్రంపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Watch this video :
https://www.youtube.com/watch?v=LUChAeMnV0Y
End of Article