‘వీర సింహ రెడ్డి’ సినిమాతో.. మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్‌గా చూపించి మసాలా ప్రియులకు మాస్‍ బిరియానీ రుచి చూపించారు. తన అభిమాన హీరోని.. ప్రేక్షకులకు ఎలా చూపిస్తే నచ్చుతుందో అలా చూపించాడు స్క్రీన్‌పై. తాను ఫ్యాక్షనిజం బాట పట్టి తన చుట్టూ ఉన్న వాళ్లని దారి మళ్లించి మార్పుకి శ్రీకారం చుట్టడం బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ఫార్ములా. ఈ చిత్రం లో కూడా అదే చేసారు గోపీచంద్ మలినేని.

Video Advertisement

సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో దుమ్ము లేపింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్‌ తో వచ్చిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య కి చెల్లిగా నటించింది. శృతి హాసన్, హానీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు.

memes on saptagiri scene from veerasimha reddy.

అయితే ఈ చిత్రం లోని ఒక సీన్ లో వీరసింహ రెడ్డి, అతడి కుమారుడు జై చాలా సంవత్సరాలకి కలుస్తారు. ఈ నేపథ్యం లో వారిద్దరిని కలిపి ఫోటో తీస్తుంది హనీ రోజ్. ఆ టైం లో ఎక్కువ లైటింగ్ ఉన్నా కూడా సప్తగిరి రెండు ఫోన్స్ లో ఫ్లాష్ ఆన్ చేసి పెడతాడు. దీంతో ఈ సీన్ ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎండలో ఇలా ఫ్లాష్ ఆన్ చేసి ఫోటోలు తియ్యాలని తెలియలేదండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

memes on saptagiri scene from veerasimha reddy.

ఇక గతం లో బాలకృష్ణ సప్తగిరి గురించి మాట్లాడుతూ..”సప్తగిరి టైమింగ్ బాగుంటుంది. ఆయనను చూసి నేను కామెడీ టైమింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది. నేను అనసూయమ్మ గారి అల్లుడు, మంగమ్మ గారి మనవడు సినిమా చేసినా.. కామెడీ టైమింగ్ రాలేదు. సప్తగిరి కామెడీ టైమింగ్ నేను నేర్చుకోవాలి.” అని బాలయ్య సప్తగిరి నటనని వీర సింహ రెడ్డి సక్సెస్ మీట్ లో మెచ్చుకున్నారు.