ప్రభాస్ హీరో గా నటించిన చిత్రాల్లో డార్లింగ్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రేమకథ చిత్రాల ఎక్స్పర్ట్. దర్శకుడు ఏ. కరుణాకరన్ తీసిన ఈ చిత్రం లో ప్రభాస్ సరసన కాజల్ కథానాయికగా నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించారు. ప్రభాస్ 13 వ చిత్రం గా విడుదలై అతడికి మంచి క్లాస్ ఇమేజ్ తెచ్చి పెట్టింది ఈ చిత్రం. డార్లింగ్ మూవీ ప్రభాస్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

Video Advertisement

10 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం 22 కోట్లు వసూలు చేసింది. అయితే ఛత్రపతి సినిమా తర్వాత సరైన హిట్ లేని సమయం లో అయిదేళ్ల తర్వాత ఈ చిత్రం తో కం బ్యాక్ ఇచ్చారు ప్రభాస్. తన మాస్ ఇమేజ్ ను, ఫాలోయింగ్ ను పక్కన పెట్టి ప్రభాస్ ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేసాడు. మొదటి షోతోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది ఈ చిత్రం. అప్పటి నుంచి ప్రభాస్ ముద్దు పేరు డార్లింగ్ అయిపోయింది. అలాగే ప్రభాస్ కూడా తన సన్నిహితులను డార్లింగ్ అని పిలుస్తాడన్న విషయం మనకు తెలిసిందే.

prabhas darling movie scenes copied from a korean movie..??

ఈ సినిమాలో పాటలు ఎంత సూపర్ హిట్టో మనకి తెలుసు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పేటప్పుడు వచ్చే ‘నీవే నీవే’ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ టేకింగ్.. ఆ లొకేషన్స్ అన్ని ఆకట్టుకుంటాయి. అయితే ఆ సాంగ్ లో ఒక సీన్ లో కాజల్ ఒక కాలువ దాటుతూ అందులో పడిపోతుంది. ఆమె సామాన్లు కూడా కొట్టుకు పోతాయి. దూరం నుంచి కాజల్ ని ఫాలో చేస్తున్న ప్రభాస్ తర్వాత రోజు కాజల్ వచ్చే సమయానికి ఆ కాలువ పై ఒక చిన్న వంతెన కట్టి ఆమె సామాన్లు అక్కడ పెడతాడు. ఈ సీన్ సినిమాలో చాలా బావుంటుంది.

prabhas darling movie scenes copied from a korean movie..??

అయితే 2006 వచ్చిన ‘డైసీ’ దక్షిణ కొరియా సినిమాలో ని ఒక పాటలో సేమ్ ఇలాంటి సీన్లే ఉంటాయి. అక్కడ కూడా హీరో .. హీరోయిన్ కోసం ఇలాగే చేస్తాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ సీన్లు ఎక్కడో చూసినట్టుంది అంటూ ఆ వీడియో ని వైరల్ చేస్తున్నారు. డార్లింగ్ దర్శకుడు ఈ సీన్లను కాపీ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం అలా చేయడం లో తప్పేమి లేదు.. ఇంకా డార్లింగ్ సినిమాలో చాలా బాగా చేసారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో ని చూడండి.

watch video: