ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలని చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వయసులో కూడా చెరగని అందం తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు ఆమె. అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఇప్పటికీ అదే స్పీడుతో ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు.

Video Advertisement

ఆమే రమ్య కృష్ణ. నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. గ్లామర్ లుక్‌లో కనిపించినా ఒక్క రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ.

the glamourous photos of senior heroine ramya krishna..

అలాగే సోషల్ మీడియాలోనూ రమ్యకృష్ణ తన హవా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్‌గా మారాయి.

the glamourous photos of senior heroine ramya krishna..

దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. ఈ క్రమంలోనే ఎన్నో భాషల్లో వరుసగా సినిమాలు చేశారు. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్ పొందారు. ఇప్పటికీ అదే ప్రభావం చూపుతున్నారు.

the glamourous photos of senior heroine ramya krishna..

బాహుబలి చిత్రం తర్వాత.. ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ భారీ చిత్రాల్లో భాగం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే ‘లైగర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అలాగే, ఇప్పుడు మాత్రం ఆమె ‘రంగమార్తాండ’ అనే సినిమాలో నటిస్తున్నారు.

the glamourous photos of senior heroine ramya krishna..

సినిమాల మీద సినిమాలు చేస్తూ తీరిక లేని షెడ్యూల్ గడుపుతోన్న రమ్యకృష్ణ.. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘డ్యాన్స్ ఐకాన్’ అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు.