దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ఆ సినిమాలో సీతామహాలక్ష్మీ‌గా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా మృణాల్ తన నటనతో ఫిదా చేశారు.

Video Advertisement

అయితే తాజాగా ముంబై లో జరిగిన ఒక ఫాషన్ ఈవెంట్ లో మృణాల్ పాల్గొని సందడి చేసారు. ఈ ఈవెంట్ లో మృణాల్ బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది. ఈ లుక్ తో పాటు ఆమె తన హెయిర్ స్టైల్ ని కూడా మార్చడంతో.. ఒక్క సారిగా ఈమె సీతారామం లోని సీత ఏ నా అన్న సందేహం కలుగుతోంది. ఈ లుక్ పై కొందరు ప్రసంశలు కురిపిస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

mrunal thakur new look..

అయితే సీతారామం తెచ్చిన క్రేజ్ తో మృణాల్ సౌత్ లో ఫేమస్ అయిపోయింది. ఆమె సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ పెరిగిపోయారు. అయితే సీతా రామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం కాస్తా హాటుగా, ఘాటుగా ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన సీతా రామం సినిమా అభిమానులు, నెటిజన్స్ విమర్శిస్తున్నారు.. ఇదేంటీ.. ఇలా ఫోటోలు ఏంటీ.. అని కామెంట్స్ రూపంలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి ఫోటోలతో మృణాల్ పరువు పోగొట్టుకుంటోందని మరికొందరు అంటున్నారు.

mrunal thakur new look..

ఇక ఈ భామ నటించిన సీతా రామం విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించారు. ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఈమెకు ఆఫర్లు బాగా పెరిగినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు మృణాల్ ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు.