హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంవరం అనే సినిమా తో తెలుగు తెరకు హీరోయిన్ల పరిచయమైన లయ తన అందం, అభినయం తో ప్రేక్షకులని కట్టిపడేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు అందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది లయ.

Video Advertisement

స్వయంవరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, మనోహరం, ప్రేమించు, మిస్సమ్మ వంటి చిత్రాలు లయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేశారు.అయితే లయ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే, 26 ఏళ్ళ వయసులో అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ గణేష్ ని వివాహం చేసుకుని అమెరికా వెళ్లి పోయారు. లయ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

what heroine laya doing in america..!!

తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ధకాలం పాటు హీరోయిన్‌గా రాణించిన.. లయ మంచి చెస్ ప్లేయర్ కూడా. టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలలో పాల్గొని.. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి మెడల్స్ గెలుచుకున్నారు. ఇక లయ భర్త గణేష్ వృత్తి రిత్యా ఒక డాక్టర్. ఇక ఆయనకంటూ ప్రత్యేకమైన మూడు హాస్పిటల్స్ ఉన్నాయట. అయితే లయ అమెరికా వెళ్లిన తర్వాత లయ కొన్నాళ్ళు సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని చేసారు.

what heroine laya doing in america..!!

ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో జాబ్ కి గ్యాప్ తీసుకున్న లయ.. ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్ళు కావడం తో తిరిగి జాబ్ లో చేరారు . ప్రస్తుతం లయ పనిచేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. కాలిఫోర్నియాలో లో ఉన్న ఈ ఈ ఎయిర్ బస్ సంస్థలో ఐటీ ఇంజనీర్​గా పనిచేస్తున్నట్లు లయ వెల్లడించారు. ఇక ఇటీవల హైదరాబాద్​ వచ్చి పలు ఇంటర్వూస్ లో పాల్గొని వెళ్లారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, ఫోటోస్ పెడుతూ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.