హీరో కావాల‌న్న త‌న చిర‌కాల వాంఛ‌ను ‘ది లెజెండ్’ సినిమాతో తీర్చుకున్నాడు శ‌ర‌వ‌ణ స్టోర్స్ అధినేత శ‌ర‌వ‌ణ‌న్‌. ఐదు ప‌దుల వ‌య‌సులో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ ఒక్క సినిమాతో శ‌ర‌వ‌ణ స్టోర్స్ శ‌ర‌వ‌ణ‌న్ కాస్త లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌గా మారిపోయాడు. రూ.60 కోట్ల రూపాయల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ‘ది లెజెండ్’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రం శ‌ర‌వ‌ణ‌న్‌కు భారీ న‌ష్టాల‌ను తీసుకొచ్చింది.

Video Advertisement

లెజెండ్ చిత్రాన్ని ఉన్నత నిర్మాణ విలువలతో లెజెండ్ మూవీ తెరకెక్కించారు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లెజెండ్ చిత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ లో పదో వంతు కూడా లెజెండ్ వసూలు చేయలేకపోయింది. వేల కోట్ల ఆస్తి కలిగిన అరుళ్ తన సొంత బ్యానర్ లో నిర్మించి విడుదల చేశారు. అయితే శరవణన్ మరో చిత్రాన్ని చేయనున్నట్లు కోలీవుడ్ టాక్. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జోన‌ర్‌లో శ‌ర‌వ‌ణ‌న్ త‌న రెండో సినిమా చేయనున్నట్లు సమాచారం.

saravanan new look..

అయితే తాజాగా శరవణన్ ఒక ఫోటో షూట్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. తన రెండో చిత్రం కోసం ఆయన ఈ మేక్ఓవర్ చేసినట్లు తెలుస్తోంది. ది లెజెండ్’ సినిమాలో ఉన్న లుక్‌కు, ప్రస్తుతం ఉన్న లుక్‌కు ఏ మాత్రం పొంతన లేదు. పైగా గతంలో కంటే స్టైలిష్‌గా కనిపిస్తున్నారు శరవణన్. డ్రెస్సింగ్ స్టైల్‌ కూడా మార్చడంతో ఇప్పుడు కాస్త బెటర్ లుక్‌తో కనిపిస్తున్నారు శరవణన్. ఆయన లుక్ చూసి జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

saravanan new look..

ఇక శరవణన్ తన తదుపరి ప్రాజెక్ట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 20 ఏళ్ల కుర్రాడిలా మారిపోయిన అరుళ్ తన తర్వాత చిత్రం లో 11 మంది హీరోయిన్లతో ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదొక లవ్ స్టోరీ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తో అయినా హిట్ కొట్టాలని అరుళ్ ప్రయత్నిస్తున్నారు.