ఈ రోజుల్లో హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో.. వాళ్ల పిల్లలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ వచ్చేస్తుంది. దానికి కారణం వాళ్ల కడుపున పుట్టడమే. కావాలంటే చూడండి.. బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాద్య నుంచి టాలీవుడ్‌లో పవన్ కొడుకు అకీరా నందన్.. మహేష్ బాబు కూతురు సితార.. బన్నీ కూతురు అర్హ వరకు సోషల్ మీడియాలో సూపర్ స్టార్స్ అయిపోయారు. వారిపై ఉండే అట్టెన్షన్ అలాంటిది మరి.

Video Advertisement

తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కుమార్తె ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల భామ అసిన్. గ‌జిని, శివ‌మ‌ణి, ల‌క్ష్మి న‌ర‌సింహా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన అసిన్ పెళ్లి కావడంతో సినిమాలకు దూరం అయ్యింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోలందరి సరసన నటించింది అసిన్. నాగార్జునతో శివమణి.. పవన్‌తో అన్నవరం.. బాలయ్యతో లక్ష్మీ నరసింహా.. ఇలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోలందరినీ చుట్టేసింది అసిన్.

did you know this star heroine daughter..??

అమీర్ ఖాన్ గజినీ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన అసిన్.. ఆ తర్వాత 10 సినిమాల వరకు నటించింది. తర్వాత మైక్రోమాక్స్ మొబైల్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మను 2016లో వివాహం చేసుకున్నారు అసిన్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం గా ఉన్నారు ఈ స్టార్ హీరోయిన్. అసిన్ గత కొంలతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. అయితే అప్పుడప్పుడు ఆమె తన భర్తకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసేది.

did you know this star heroine daughter..??

అసిన్ కి ఒక కుమార్తె ఉంది. తన పేరు అరిన్. అయిదేళ్ల వయసున్న అరిన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాపను చూస్తుంటే అచ్చంగా అసిన్‌ను చూస్తున్నట్లే ఉంది కదా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సేమ్ టూ సేమ్ అమ్మ మాదిరే డ్రెస్సింగ్ చేసుకుని అరిన్ ఇచ్చిన పోజులు వైరల్ అవుతున్నాయి. బుట్టబొమ్మ లా ముద్దుగా ఉన్న అరిన్ ప్రస్తుతం అమ్మ లాగే డాన్స్ నేర్చుకుంటుంది.