‘ప్రేమ ఖైదీ’ సినిమాతో తెలుగు తెర పై సెన్సెషన్ క్రియేట్ చేసిన హీరో.. హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన 13 ఏళ్ల వయసులోనే హీరోగా మారారు. హరీష్ ఎక్కువగా ప్రేమకథ చిత్రాల్లోనే కనిపించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి హిట్స్ కొట్టారు. నార్త్ లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Video Advertisement

 

తెలుగులో ‘ప్రేమఖైదీ’ సినిమాతో సెన్సేషన్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఇదే మూవీని హిందీలో రీమేక్ చేసి కరిష్మా కపూర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తెలుగులో హీరోగా పెళ్లాం చెబితే వినాలి, రౌడీ ఇన్ స్పెక్టర్, కాలేజీ బుల్లోడు, ప్రేమ విజేత, ఏవండీ ఆవిడ వచ్చింది, ప్రాణదాత, మనవరాలి పెళ్లి, బంగారు కుటుంబం, జైలర్ గారి అబ్బాయి, ఎస్పీ పరశురాం సినిమాతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ‘ఆంధ్రకేసరి’, యాక్టర్ గా ‘ఒహో నా పెళ్లంట’ సినిమాలతో నంది అవార్డులు అందుకున్నాడు. మొత్తంగా దాదాపు 280 సినిమాల్లో నటించిన హరీష్ ను ప్రేక్షకులు ముద్దుగా ‘హ్యాండ్సమ్ స్టార్’ అని పిలుచుకొనేవారు.

know the details of veteran actor harish..!!

హరీష్ బాలీవుడ్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసాడు. ఇక హీరోగా నటించిన ‘ప్రేమ ఖైదీ’ చిత్రం హిట్ అవ్వడంతో అక్కడ కూడా స్టార్ హీరో అయిపోవాలని ట్రై చేసాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో సౌత్ లో అతన్ని చాలా వరకూ మరిచిపోయారు. అలాగే మలయాళం లో చేసిన కొన్ని చిత్రాలు అతడి కెరీర్ పై నెగటివ్ ఇంపాక్ట్ చూపించాయి. దీంతో ఫ్యామిలీ, రెగ్యులర్ ఆడియెన్స్ కు హరీష్ మెల్లమెల్లగా దూరమయ్యాడు. పాన్ ఇండియా రేంజ్ లో హీరో కావాల్సిన హరీష్ కాస్త.. ఛాన్సులు తగ్గిపోవడం, వ్యక్తిగత కారణాలతో క్రమంగా సినిమాల్లో కనిపించడం మానేశాడు.

know the details of veteran actor harish..!!

కెరీర్ మంచి ఫాంలో ఉందనుకున్న సమయంలోనే హరీష్ కు మెల్లగా అవకాశం రావడం తగ్గాయి. ఆ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు అంతగా మెప్పించలేదు. చివరిగా 2021 డిసెంబరులో హైదరాబాద్ లో జరిగిన ‘సంతోషం అవార్డ్స్’ ఫంక్షన్ లో కనిపించాడు. అతడు ప్రస్తుతం ప్రస్తుతం భార్యాపిల్లలతో కలిసి ముంబయిలోనే ఉంటున్నాడు. అతడు సోషల్ మీడియా లో కూడా అంత యాక్టీవ్ గా లేరు. నవంబరులో తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.