ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రోహిత్ వరుస హిట్లు కొట్టేశారు. 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి అంటూ హీరోగా సూపర్ హిట్లను అందుకున్నారు రోహిత్ . ఆ తర్వాత శంకర్‌దాదా MBBS, నవ వసంతం వంటి సినిమాలతో నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు రోహిత్.
Video Advertisement
కొంత కాలం గ్యాప్ తీసుకొని 2013లో హాఫ్ బాయిల్ అనే సినిమాలో నటించారు. రోహిత్ మధ్యలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా అవి ఏవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా నటించారు రోహిత్. 2021 లో వచ్చిన కళాకార్ చిత్రానికి శ్రీను బందెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చారు రోహిత్. ఆ మూవీ కి సంబంధించిన పోస్టర్ ని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో రోహిత్ చాలా డిఫరెంట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో కనిపించారు.
అయితే ఈ మూవీ విడుదల అయిన తర్వాత కూడా ఆయన బిజీ కాలేదు. కళాకార్ మూవీ లో షాయాజీషిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనుకున్న ఫలితం రాలేదు.
దీంతో మళ్ళీ సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు రోహిత్. ఇటీవల జరిగిన మా ఎలక్షన్స్ లో కూడా ఆయన ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసారు. ఇక ఆ తర్వాత ఆయన బయట కనిపించలేదు. ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలియరాలేదు.
రోహిత్ ప్రజెంట్ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తాజాగా రోహిత్ కి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి. హీరోలు శివ బాలాజీ, బాలాదిత్య, వెంకట్ తో కలిసి రోహిత్ దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.