వడ్డే నవీన్​.. 1997 నుంచి దాదాపు ఓ ఐదేళ్ల పాటు సినీప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. నిర్మాత వడ్డే రమేష్​ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, స్నేహితులు వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన పెళ్లి చిత్రం తన కెరీర్​లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది. ఆ తర్వాత ప్రేమించే మనస్సు, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చక్రి వంటి సినిమాలు నవీన్​కు గుర్తింపు తీసుకొచ్చాయి.

Video Advertisement

 

ఇతను సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ అల్లుడు అన్న సంగతి తెలిసిందే. రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు నవీన్. కానీ వీళ్ళు కొన్ని కారణాల వలన విడిపోయారు. ఆ తర్వాత నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకుంటే నవీన్ అనుకోకుండా కనుమరుగు అయిపోయాడు. చివరిగా నవీన్ నాలుగేళ్ల క్రితం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘ఎటాక్’ లో నటించాడు. కానీ నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఆ చిత్రం పెద్ద బూస్టప్ ను ఇవ్వలేదు.

did you remember this actor..

ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ‘కోరుకున్న ప్రియుడు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు వడ్డే నవీన్. ఆ చిత్రం హిట్ అవ్వడంతో ఇతను లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి చిత్రం తోనే సూపర్ హిట్ అందుకున్న నవీన్ ప్రస్తుతం తన ఫ్యామిలీ బిజినెస్ లను చూసుకుంటున్నాడు. తనకి సూట్ అవుతుంది అనే పాత్రలు దొరికితే కచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తానని ఇతను గతం లో చెప్పుకొచ్చారు. అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డానని, పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు అంటుంటారు.

did you remember this actor..

అయితే తాజాగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం లో నవీన్ కనిపించారు. చాలా కాలం తర్వాత ఆయన బయటికి రావడం తో ఆయన ఫాన్స్ సంతోషం వ్యక్తం చేసారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఆయన లో ఏ మార్పు లేదని.. అంతే ఛార్మింగ్ గా ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కురిపిస్తున్నారు నెటిజన్లు. అసలు వడ్డే నవీన్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదని, ఉన్నట్టుండి సినిమాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారో తెలియరాలేదు.