“రన్ రాజా రన్” సినిమా హీరోయిన్ గుర్తుందా..?? ఇలా మారిపోయిందేంటి..??

“రన్ రాజా రన్” సినిమా హీరోయిన్ గుర్తుందా..?? ఇలా మారిపోయిందేంటి..??

by Anudeep

Ads

‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ కి పాజిటివ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సీరత్ కపూర్. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. 2015 వ సంవత్సరంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్’ లో కూడా హీరోయిన్ గా నటించింది. అలాగే ‘కొలంబస్’ ‘రాజు గారి గది 2’ ‘టచ్ చేసి చూడు’ ‘ఒక్క క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘మా వింత గాధ వినుమా’ వంటి చిత్రాల్లో ఈమె నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

Video Advertisement

అయితే గత మూడేళ్ళుగా సీరత్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఆమె చివరిగా తెలుగులో మా వింత గాధ వినుమా చిత్రం చేసింది. సిద్దు జొన్నలగడ్డ హీరో. ఆ తర్వాత ఇటీవల హిందీ లో వచ్చిన ‘మారిచ్; అనే క్రైం థ్రిల్లర్ లో నటించింది. ముంబై లో పుట్టి పెరిగిన సీరత్ కి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. అలాగే ఆమె మంచి డాన్సర్ కూడా. చదువు పూర్తి కాగానే సీరత్ బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

did you remember this heroine..!!

మోడలింగ్ లో కూడా మెరిసి.. నటనలో శిక్షణ తీసుకుంది సీరత్. 2014 లో బాలీవుడ్ లో జిద్, తెలుగులో రన్ రాజా రన్ చిత్రం తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మొత్తం 8 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది సీరత్. ప్రస్తుతం సినీ అవకాశాలు తగ్గడం తో డాన్సర్ గా తన కెరీర్ ని కొనసాగిస్తోంది. ఎంతో అందం గా కనిపించే సీరత్.. పలు సర్జరీలు చేయించుకోవడం తో ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

did you remember this heroine..!!

సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలని చూసిన ఆమె ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. సీరత్ ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె సర్జరీస్ చేయించుకోకముందే అందం గా ఉంది కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మల్లి తెలుగు సినిమాల్లో నటించాలని ఆమె ఫాన్స్ ఆశిస్తున్నారు.


End of Article

You may also like