“సిరివెన్నెల” సినిమా హీరోయిన్ గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

“సిరివెన్నెల” సినిమా హీరోయిన్ గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

by kavitha

Ads

మూన్ మూన్ సేన్ ఈ పేరు ఈతరం వారికి అంతగా తెలియయకపోవచ్చు. కానీ 80వ దశకం ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె బెంగాలీ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ, కన్నడ భాషా సినిమాలలో నటించింది. మూన్ మూన్ దాదాపు 60 సినిమాలు, 40 బుల్లితెర సీరియళ్లలో నటించింది.

Video Advertisement

మూన్ మూన్ సేన్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, తన గ్లామర్ తో ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకునేది. ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘100 డేస్’ లో గుర్తుండిపోయే సినిమాగా చెప్పవచ్చు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎన్నో భాషల చిత్రాలలో నటించిన మూన్ మూన్ ఎన్నో సంచలనాలకు, వివాదాలకు అప్పట్లో పేరు గాంచారు.
ఈమె ఒక బ్రాహ్మణ ఫ్యామిలిలో జన్మించింది. ఆమె తండ్రి దీపనాథ్ సేన్, తల్లి  బెంగాలీ నటి సుచిత్రా సేన్.  ఈమె షిల్లాంగ్ లోని లోరెటో కాన్వెంట్‌లో, కోల్‌కాతాలోని లోరెటో హౌస్‌లో చదువుకుంది. చిన్నప్పటి నుండి తల్లి సుచిత్రా సేన్‌ తో కలిసి సినిమా షూటింగ్ లకు వెళ్లడంతో ఆమెకు నటన పై ఆసక్తి కలిగింది. ఆమె ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె పెళ్లి, పిల్లలు అయిన తరువాత సినిమాలలో యాక్టింగ్ ప్రారంభించింది. మూన్ మూన్ సేన్ నటిగా మారక ముందు మోడల్‌గా చేశారు. ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించి అనేక వివాదాలకు కారణమైంది. 1984లో ఆమె అనిల్ కపూర్ నటించిన ‘ఆనంద్ బహర్‌’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీకి ముందు ఆమె అనేక బెంగాలీ సినిమాలలో నటించింది. అప్పటికే తల్లి అయిన ఆమె ఎక్కువగా గ్లామర్ పాత్రలలో నటించడం వల్ల , ఒక వర్గం ఆడియెన్స్ మరియు సినీ క్రిటిక్స్ నుండి విమర్శలకు గురి అయ్యింది. హిందీలో అగ్ర నటులతో నటించింది.
ఆమె 1986లో సిరివెన్నెల చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరోకు తన కళ్లను దానం చేసే  జ్యోతిర్మయి పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ఆ మూవీకి నంది అవార్డ్ కూడా అందుకుంది. ఆ తరువాత, 1987లో అక్కినేని నాగార్జునతో మజ్ను సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఆమె ఎన్ని భాషలలొ నటించిన బెంగాలీ చిత్రాలలో కొనసాగారు. ఆమె చివరిగా 2019 రిలీజ్ అయిన ‘భోబిష్యోటర్ భుట్’ అనే చిత్రంలో కనిపించింది. మూన్ మూన్ సేన్ ఇద్దరు కుమార్తెలు రైమా సేన్, రియా సేన్ లు యాక్టింగ్ నే కెరీర్ గా ఎంచుకున్నారు.

https://www.instagram.com/p/CqzSWnEJvoB/?hl=en

Also Read: సిటాడెల్ సిరీస్ ప్రీమియర్‌లో “సమంత” ధరించిన… నగల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!


End of Article

You may also like