డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రాలలో హ్యాపీడేస్ సినిమా కూడా ఒకటి. 2007లో విడుదలైన ఈ చిత్రం యువతకు బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ బాగా నటించారు. అయితే వీరిలో వరుణ్ సందేశ్, తమన్నా కి మంచి క్రేజ్ వచ్చింది.
Video Advertisement
అయితే వీరు కాకుండా మరొక జోడి రాహుల్, సోనియా దీప్తి కూడా ప్రేక్షకులకు బాగా గుర్తున్నారు. ముఖ్యంగా ఆమె రింగురింగుల జుట్టు (కర్లీ హెయిర్)కు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే సోనియా వాయిస్ కూడా యూత్‌ను కట్టిపడేసింది. సోనియాది హైదరాబాదే. ఇక్కడే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక ఐటీ సంస్థలో మూడేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది.
అయితే ఒక ప్రమోషన్ ఈవెంట్‌లో సోనియాను చూసిన శేఖర్ కమ్ముల హ్యాపీడేస్‌లో స్రవంతి పాత్రకు సెలెక్ట్ చూశారు. ఈ పాత్రతో ఆమెకు మంచి పేరు తో పాటు వరుస అవకాశాలు కూడా వచ్చాయి. వినాయకుడు, బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అలాగే పలు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ కి ఫ్రెండ్ పాత్రల్లో కూడా నటించింది.
సోనియా దీప్తి తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ తదితర భాషలలో కలిపి దాదాపుగా 12 కు పైగా చిత్రాలలో నటించింది. 2016లో చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే అనే తెలుగు సినిమాలో, 2017వ సంవత్సరంలో “పురియట పురియర్” అనే తమిళ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఈమె నటించిన ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందువల్లనే సోనియా దీప్తి సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
సినిమాల్లో కనిపించకపోయినా కొన్ని సామాజిక కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తోంది సోనియా. మహిళా సాధికారత, మోరల్ పోలీసింగ్‌లకు సంబంధించి ఆమె రిలీజ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్‌కు మంచి పేరొచ్చింది. అయితే ప్రస్తుతం సినిమాల్లోకి మరోసారి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది సోనియా. అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.