Ads
ఒకప్పుడు తమ అందంతో అలరించిన తెలుగు నటి భువనేశ్వరి. ‘దొంగరాముడు అండ్ పార్టీ’ ‘బాయ్స్’ ‘గుడుంబా శంకర్’ ‘చక్రం’ ‘ఆంజనేయులు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె బాగా దగ్గరైంది. మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో సైడ్ కేరెక్టర్లలో నటించారు. ఈమె తెలుగులో చేసిన చివరి సినిమా ‘అలా జరిగింది ఒక రోజు’. ఈ సినిమా 2014లో విడుదలైంది.
Video Advertisement
భువనేశ్వరి అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి రాగానే ఆమె అవకాశాల కన్నా ఆమె అందానికి మంత్రముగ్ధులైన ఎంతో మంది దర్శకనిర్మాతలు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమకే పరిమితం అయిన ఆమె.. 100 కు పైగా చిత్రాల్లో నటించారు.
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది. సీరియల్స్ లో ఎక్కువగా నెగటివ్ పాత్రలో నటించింది.సినిమాలలో కూడా నెగటివ్ పాత్రలలో, సహాయ పాత్రలలో నటించింది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. ఈమె నటిగా కంటే వివాదాల్లో ఎక్కువగా నిలిచేవారు.
రెండుసార్లు ఈమెను పోలీసులు అరెస్టు చేశారు.ఈ విషయం అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నటి కుర్రకారులను మంత్రముగ్ధులను చేస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలలో అంతగా కనిపించడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం ఈమెను ఎక్కువగా ఎంచుకునేవారు దర్శకనిర్మాతలు.
అయితే ఓ నిర్మాత ఈమె పై కేసు వేయడం అప్పట్లో అది సంచలనంగా మారడంతో ఈమె నటనకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు ఈమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈమె లేటెస్ట్ లుక్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది లేటెస్ట్ వీడియో కాకపోయినా.. ఆ వీడియో లో కూడా ఆమె అప్పటికి ..ఇప్పటికి చాలా మారిపోయినట్లు కనిపిస్తోంది.
End of Article