టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సీత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఆమె 2002 లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసింది సీత. నటిగానే కాక నిర్మాతగా కూడా సీత హిట్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాల్లో కనిపించడం తగ్గింది. కానీ బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూ పలు సీరియల్స్ లో నటిస్తున్నారు.

Video Advertisement

 

అయితే తాజాగా ఈమె చేసిన ఒక్క ఫోటో షూట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మోడరన్ చీరకట్టు, హెయిర్ స్టైల్ తో ఈమె మనకు తెలిసిన సీతేనా అనేంతలా మారిపోయారు ఈ ఫొటోల్లో. సినిమాల్లో చాలా హుందాగా పద్దతైన కట్టు బొట్టు లో కనిపించిన సీత ఇలా మేకప్ తో పది ఇరవై సంవత్సరాల వయసు తగ్గడం తో గుర్తించడం కాస్త కష్టంగానే ఉంది.

did you remember this old star heroine.

గంగోత్రి, సింహాద్రి, ప్రాణం, బన్నీ, హరే రామ్ వంటి చిత్రాల్లో ఆమె తల్లి పాత్రలు చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ బిజీ గా ఉన్నారు. 55 సంవత్సరాలు సీత ఈ వయసులో కూడా ఎంతో అందం గా, ట్రెండీ గా ఉంటూ ఆమె ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకోవడం తో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

did you remember this old star heroine.

1980 ల్లో సినీ రంగ ప్రవేశం చేసి 55 ఏళ్ల వయసులో కూడా బిజీ గా ఉన్న సీత నటన విషయంలో పలు సార్లు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. నటిగా సీత ఎన్నో సార్లు అలరించింది.. ఆశ్చర్యపర్చింది. అయితే మొదటి సారి ఇలా తన లుక్ తో సీత సర్ ప్రైజ్ చేశారు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ ఫోటో షూట్ తో ఈమెకు మళ్ళీ అవకాశాలు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదు అని అంటున్నారు సినీ జనాలు.