ఒకప్పటి విలన్ రఘువరన్ గుర్తున్నారా? ఆయన కొడుకు ఇప్పుడు హీరోలా ఉన్నాడు చూడండి..!

ఒకప్పటి విలన్ రఘువరన్ గుర్తున్నారా? ఆయన కొడుకు ఇప్పుడు హీరోలా ఉన్నాడు చూడండి..!

by Anudeep

Ads

నటుడు రఘువరన్.. ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఆయన విలన్ పాత్ర ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా ఉంటుంది. విలన్ అనే మాటకు ఆయన కొత్త అర్థాన్ని తీసుకువచ్చారు. ఆయన మొదట చేసిన సినిమా మెగాస్టార్ చిరంజీవి ప్రతివాడి ప్రాణంలో వికలాంగుడైన విలన్ పాత్రలో ఆయనను చూసి మంచి నటుడు అని అన్నారు.

Video Advertisement

కానీ శివ చిత్రం తర్వాతే రఘువరన్ తెలుగులో మంచి పేరు సంపాదించారు. భయంకరమైన అరుపులు, కేకలతో సాగిపోతున్న విలన్ పాత్ర లకు రఘువరన్ అడ్డుకట్ట వేసారని చెప్పవచ్చు. ట్రెండ్ కు అనుగుణంగా నటిస్తూ ఆధునిక శైలిలో మాట్లాడుతూ తేనె పూసిన కత్తి లాంటి విలన్ గా కనిపించడం రఘువరన్ పద్ధతి.

raghuvaran 1

ఏ పాత్ర అయినా ఛాలెంజ్ గా తీసుకొని దాని కోసం చాలా కష్టపడి అందులో నటించడం కాదు జీవించి పోయాడు. కానీ ఆయనకు కొన్ని చెడు అలవాటు ఉండేది. సారా పొట్లం నుంచి స్టార్ హోటల్ లో దొరికే కాస్ట్లీ మద్యం వరకు ఏది వదిలిపెట్టేవాడు కాదు. అమ్మాయిల వెంట తిరిగే వారట. ఏది చేయాలి అనిపిస్తే అది భయపడకుండా చేసేవారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

raghuvaran 2

రోహిణి పరిచయంతోనే ఇది సాధ్యమైంది. మందు కాదు కదా సిగరెట్ కూడా మానేశారు. ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే 2004లో రఘువరన్ రోహిణి విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం రఘువరన్ మళ్లీ మద్యానికి మత్తు పదార్థాలకు బానిస కావడమే. వీరిద్దరికి కలిగిన కుమారుడే రిషి వరన్. ఇప్పుడు రిషి వరన్ పెద్దయ్యి హీరోలా ఉన్నాడు. రఘువరన్ చనిపోయే ముందు కొన్ని పాటలు పాడి రికార్డు చేసారు. వాటిని రోహిణి ఆల్బమ్ లా తీసుకొచ్చారు. ఈ ఆల్బం ను రజినీకాంత్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా రిషి వరన్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. అతని ఫోటోలు వైరల్ అయ్యాయి.


End of Article

You may also like