రవీనా టాండన్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రవి టాండన్ కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు హీరోయిన్‌గా ఒక తరాన్ని తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. హీరోయిన్ కాకముందు ముంబైలో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘పత్తర్ కే పూల్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకుంది.
Video Advertisement
తాజాాగా యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2లో ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్రలో హీరోను ఢీ కొట్టే పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఈ పాత్రతో నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో అట్రాక్ట్ చేసింది ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్.
తాజాగా రవీనా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె రాషా టాండన్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోలు, వీడియోలను పంచుకుంది రవీనా. వాటిలో రాషా చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకు ఉన్న పిక్స్ ఉన్నాయి. వాటితో పటు రవీనా, రాషా కలిసి ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి.
వాటిని చూసిన నెటిజన్లు రాషా సేమ్ రవీనా టాండన్ లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. రాషా యంగ్ ఏజ్ లో ఉన్న రవీనా టాండన్ లా ఉంది, రవీనా టాండన్, రాషా కవలల్లా ఉన్నారంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.
తెలుగులో అక్కినేని నాగేశ్వరావు, వినోద్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన ‘రథసారధి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వా త హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో స్వాతిలో ముత్యమంత పాటలో తన తడి అందాలతో ఇక్కడి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది.
ఆ తర్వాత తెలుగులో ‘ఆకాశవీధిలో’ సినిమాలో నాగార్జున సరసన మెరిసింది. ఆ తర్వాత మోహన్బాబు హీరోగా నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ సినిమాలో నటించింది.