ట్రైన్ ఒక కిలో మీటర్ వెళ్లాలంటే ఎంత డీజిల్ అవసరమో మీకు తెలుసా..?

ట్రైన్ ఒక కిలో మీటర్ వెళ్లాలంటే ఎంత డీజిల్ అవసరమో మీకు తెలుసా..?

by Megha Varna

Ads

తరచూ మనం రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము. అయినప్పటికీ మనకి రైల్వేస్ కి సంబంధించిన చాలా విషయాలు తెలియదు. నిజానికి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అటువంటి విషయాలను తెలుసుకుంటే మన యొక్క జ్ఞానం కూడా పెరుగుతుంది.

Video Advertisement

అలాగే ఎవరైనా తెలియని వాళ్ళకి మనం వాటిని చెప్పచ్చు. పైగా కొన్ని ఫ్యాక్ట్స్ ని వింటే అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం. చాలా మందికి రైలు వెళ్ళడానికి ఎంత డీజిల్ అవుతుంది..?, ఎంత డీజిల్ కావాలి అనేది తెలియదు.

సాధారణంగా రైళ్లు కరెంట్ తో నడుస్తాయి. అంతే కాకుండా కొన్ని రైళ్లు అయితే డీజిల్ తో కూడా నడుస్తాయి. అయితే డీజిల్ తో నడిచే ట్రైన్స్ ఎంత మైలేజ్ ని ఇస్తాయి అనేది చాలా మందికి తెలియదు. మీకు కూడా తెలియదా..? మరి ఇక్కడ దీని జవాబు వుంది చూసేయండి. అయితే ట్రైన్ లో మూడు రకాల డీజిల్ ట్యాంక్స్ ఉంటాయి.

ఐదు వేల లీటర్ల ట్యాంక్ ఒకటి. ఇంకొకటి 5500 లీటర్ల ట్యాంక్ మరియు మూడవది ఆరు వేల లీటర్ల ట్యాంక్. ఒక ట్రైన్ కి 24 నుండి 25 బోగీలు ఉంటాయి. దీని ప్రకారం చూసుకున్నట్లయితే రైలు ఒక కిలో మీటర్ వెళ్లడానికి ఆరు లీటర్లు డీజిల్ అవసరం అవుతుంది. అయితే ఇది సాధారణ రైలుకి అయ్యే డీజిల్. కానీ గూడ్స్ ట్రైన్ కి మాత్రం అలా కాదు. గూడ్స్ ట్రైన్ కి అయితే దాని యొక్క బరువుని బట్టి మరింత ఎక్కువ అవుతుంది.


End of Article

You may also like