Ads
సాధారణంగా ట్రైన్ ప్రయాణం చాలా మంది ఇష్టపడతారు. కానీ ట్రైన్ లో కూడా రకాలు ఉంటాయి అన్న సంగతి మనందరికీ తెలుసు. ఇందులో ఫస్ట్ క్లాస్ అనే ఒక టైప్ ఉంటుంది. ఇది దాదాపు ఫ్లైట్ లాగానే ఉంటుంది. అయితే మనలో కొంత మందికి ఒక అనుమానం వస్తుంది.
Video Advertisement
అదేంటంటే “ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించే బదులు డైరెక్ట్ ఫ్లైట్ లోనే ప్రయాణించవచ్చు కదా?” అని. చాలా మంది ఫ్లైట్ కంటే కూడా ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడాన్ని ఎంచుకుంటారు. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
# ఫస్ట్ క్లాస్ ట్రైన్ లో అయితే మంచి సీట్స్ తో పాటు బెడ్ కూడా ఉంటుంది. ఫ్లైట్ లో ఈ సౌకర్యం ఉండదు.
# ట్రైన్ లో ప్రైవసీ ఉంటుంది. చాలా మందికి అందరితో పాటు కలిసి ప్రయాణించడం అంత సౌకర్యంగా అనిపించదు. అలాంటప్పుడు ఇలా ట్రైన్ ప్రయాణాలను, అది కూడా సపరేట్ కంపార్ట్మెంట్లు ఉన్న ఫస్ట్ క్లాస్ ట్రైన్ల ప్రయాణాలని ఎంచుకుంటారు.
# బోర్డింగ్ పాస్ చూపించడం, లగేజ్ పెట్టడం, తర్వాత సెక్యూరిటీ చెక్, దిగిన తర్వాత మళ్లీ లగేజ్ కలెక్ట్ చేసుకోవడం లాంటివి ట్రైన్ ప్రయాణాలలో ఉండవు.
# మనం ట్రైన్ లో ఎక్కువ లగేజిని తీసుకువెళ్ళవచ్చు. అక్కడ సహాయం చేయడానికి అటెండెంట్ కూడా ఉంటారు.
# పచ్చళ్ళు, గ్లాస్ తో తయారు చేసిన వస్తువులను కూడా తీసుకువెళ్ళవచ్చు. రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి.
# ఫ్లైట్లో అయితే పిల్లలు ఉంటే, వాళ్లు అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. అదే ట్రైన్ లో అయితే ఒకసారి కంపార్ట్మెంట్ మూసేస్తే ఎటు అయినా తిరగొచ్చు.
# బాత్రూమ్స్ లో గీజర్స్ కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు అలసిపోతే స్నానం చేసే వీలు కూడా ఉంటుంది.
# వై-ఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది. ట్రైన్ రన్ అవుతున్నప్పుడు కూడా సిగ్నల్ లో ఎటువంటి ఇబ్బంది కలగదు.
# ట్రైన్ ప్రయాణాల్లో సీట్ బెల్ట్ లాంటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
End of Article