హార్ట్ ఎటాక్ కి, కార్డియాక్ అరెస్ట్‌కి ఉన్న తేడా ఏంటో తెలుసా.? రెండు ఒకటే అనుకుంటే పొరపాటే.!

హార్ట్ ఎటాక్ కి, కార్డియాక్ అరెస్ట్‌కి ఉన్న తేడా ఏంటో తెలుసా.? రెండు ఒకటే అనుకుంటే పొరపాటే.!

by Mohana Priya

ఆరోగ్య సమస్యల్లో ప్రధానంగా అన్ని వయసుల వారిని బాధించే ఇబ్బంది, గుండెకు సంబంధించిన సమస్యలు. వారి జీవనశైలి కానీ, ఆహారపు అలవాట్లు కానీ ఒక మనిషి గుండెపై ఎంతో ప్రభావం చూపుతాయి. అలా చాలా మంది హార్ట్ ఎటాక్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా హార్ట్ ఎటాక్ అన్నా, కార్డియాక్ అరెస్ట్ అన్నా ఒకటే అని మనం అనుకుంటాం. కానీ రెండిటికీ తేడా ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

Difference between heart attack and cardiac arrest

హార్ట్ ఎటాక్ అంటే ఛాతిలో మంట లాగా వస్తుంది. చెమటలు పడతాయి. ఊపిరి ఆడకుండా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. దగ్గు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. హార్ట్ ఒక కండరం (మజిల్). అన్ని కండరాలలాగానే గుండెకి కూడా ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం సరఫరా అవ్వడం అనేది ముఖ్యం. ఈ రక్తాన్ని కొరోనరీ ఆర్టరీస్ అందిస్తాయి. గుండెపోటు అనేది రక్తం గడ్డ కట్టడం వల్ల వస్తుంది. దానివల్ల రక్త సరఫరా అనేది ఆగిపోతుంది.

Difference between heart attack and cardiac arrest

ఒకవేళ ఈ గడ్డకట్టిన రక్తాన్ని త్వరగా తొలగించకపోతే గుండె కండరాలు పనిచేయడం ఆగిపోతాయి. కార్డియాక్ అరెస్ట్ ఇందుకు కొంచెం భిన్నంగా ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్‌లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. గుండె కొట్టుకుంటున్నప్పుడు రిథమ్ లో అంతరాయం వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. కానీ హార్ట్ ఎటాక్ లో మాత్రం ఒకవేళ రక్త సరఫరాలో సమస్యలు జరిగినా కూడా గుండె కొట్టుకుంటుంది.

Difference between heart attack and cardiac arrest

కార్డియాక్ అరెస్ట్ అయితే గుండె జబ్బులు రావాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కార్డియాక్ అరెస్ట్ జరిగే దాదాపు ఒక నెల ముందు నుంచి ఆ వ్యక్తికి లక్షణాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు, కళ్లు తిరిగి పడిపోవడం, స్పందించకపోవడం, ఊపిరి ఆడడం, పల్స్ ఆగిపోవడం జరుగుతుంటాయి. కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఛాతిలో నొప్పి, ఊపిరి సరిగ్గా అందకపోవడం, బలహీనంగా అనిపించడం, కళ్ళు తిరుగుతూ ఉండటం, దడగా ఉండడం, అలాగే వికారంగా అనిపించడం, వంటివి అవుతూ ఉంటాయి.

sourced from: News Medical Life Sciences


You may also like