Ads
మన భారతదేశంలో పండగలకి కొదవలేదు. భారతదేశం అంటేనే ముఖ్యంగా గుర్తొచ్చేది సంస్కృతి, సంప్రదాయం. అయితే మన భారతదేశంలో కేవలం మన దేశానికి చెందిన పండగలు మాత్రమే కాకుండా వేరే దేశాలకు చెందిన పండగలను కూడా జరుపుకుంటాము. అందులో స్నేహితుల దినోత్సవం ఒకటి. ఆగస్ట్ నెలలో వచ్చే మొదటి ఆదివారంలో భారతదేశంలో ఫ్రెండ్‌షిప్ డే పేరుతో జరుపుకుంటారు.
Video Advertisement
ఇదిలా ఉండగా ఇవాళ కూడా ఫ్రెండ్‌షిప్ డే అంటూ సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతుంది. కానీ చూస్తే ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే. అంటే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం.
అయితే అందరూ ఇవాళే ఫ్రెండ్‌షిప్ డే అని అంటున్నారు. కానీ ఇవాళ జరుపుకునే ఫ్రెండ్‌షిప్ డేకి, భారతదేశంలో ఆగస్ట్ లో వచ్చే మొదటి ఆదివారం రోజు జరుపుకునే ఫ్రెండ్‌షిప్ డేకి తేడా ఉంది. అది ఏంటంటే. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని మొదటిసారిగా 1958 లో పరాగ్వేలో జరుపుకున్నారు. 1930 లో హాల్‌మార్క్ కార్డ్‌ల వ్యవస్థాపకుడు – జాయిస్ హాల్ ఈ రోజును మొదలుపెట్టారు. స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనని ఆయన ప్రతిపాదించారు. అంతే కాకుండా 2011లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జులై 30 తేదీన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితిలో స్నేహితుల దినోత్సవాన్ని స్నేహానికి చిహ్నంగా మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి కోసం, అలాగే సామాజిక సామరస్యం కోసం జరుపుకుంటారు. ఈ పేదరికం, హింస, ఇవన్నీ కూడా ప్రపంచ శాంతికి భంగం కలిగించడానికి ఉన్న కొన్ని విషయాలు మాత్రమే. ఇవి మాత్రమే కాకుండా మనుషుల్లో కూడా చాలా విషయాలు ఎన్నో ఇబ్బందులకు కారణం అవుతున్నాయి. అందులో కొన్ని మనిషికి మనిషి విలువ ఇచ్చుకోకపోవడం, గౌరవించకపోవడం, ఒకరికి ఒకరు అండగా నిలవకపోవడం, సహాయం చేసుకోకపోవడం కూడా ఉన్నాయి.
కాబట్టి వీటన్నిటిని కూడా తొలగించాలి అనే ఉద్దేశంతో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్నేహితుల దినోత్సవాన్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజు జరుపుకుంటారు. ఈక్వెడార్, ఎస్టోనియా, ఫిన్లాండ్, మెక్సికో, వెనిజులా మరియు డొమినికన్ రిపబ్లిక్ వంటి దేశాల్లో ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే మరియు ఫ్రెండ్‌షిప్ డే ఒకటే రోజు జరుపుకుంటారు. దక్షిణాఫ్రికాలో ఫ్రెండ్‌షిప్ డేని ఏప్రిల్ 16న జరుపుకుంటారు, ఉక్రేనియన్లు జూన్ 9న జరుపుకుంటారు. ఇలా ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
End of Article