“జిలేబి” కి “జాంగ్రీ” కి ఉన్న తేడా ఏంటో తెలుసా? రెండు ఒకటే అనుకుంటే పొరపాటే..!

“జిలేబి” కి “జాంగ్రీ” కి ఉన్న తేడా ఏంటో తెలుసా? రెండు ఒకటే అనుకుంటే పొరపాటే..!

by Megha Varna

Ads

మన తెలుగు వాళ్ళు మంచి భోజన ప్రియులు అందుకే మన రెండు తెలుగు రాష్ట్రాలలో వీధికొక హోటల్ లేదా కిరాణా షాప్ లు దర్శనమిస్తాయి.అందుకే మన తెలుగు రాష్ట్రాలలో పెద్దవాళ్ళు వాడుకలో వాడే సామెతలు,కవితలలో కూడా ఈ ఆహార పదార్థాలను చేర్చారు.ఆహారాన్ని మనవాళ్ళు అన్నపూర్ణగా అభివర్ణిస్తుంటారు.మరి మన తెలుగు సంప్రదాయాలలో అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆహారం విషయంలో రెండు పదార్థాల పేర్లు లో కన్ఫ్యూజ్ అయ్యి ఆ పదార్థాలను తప్పుగా సంబోధిస్తూ ఉంటామని మీకు తెలుసా?

Video Advertisement

ఏ ఊరుకో ఏదో చెప్పాలని చెప్పడం తప్ప మనోళ్లు ఆహారం విషయంలో అంతగా కన్ఫ్యూజ్ అవుతారా?అబ్బే నేను నమ్మను అని మీరు అనచ్చు. కాని నేను చెప్పేది నిజమండీ బాబు.ఆ రెండు పదార్థాలు ఏవంటే జాంగ్రీ,జిలేబి. ఈ రెండు చూడడానికే కాదు వీటిని తయారుచేసే విధానాలలో, రుచులలో కూడా ఒకటిగా ఉండవు.కాని ఈ రెండు పదార్ధాల విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.

ముందుగా జిలేబి దీన్ని మైదాతో తయారు చేస్తారు.ఇది ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఇది రోడ్డు మీద ఎక్కువగా దర్శనమిస్తుంటుంది.

ఇక రెండో ఐటెం జాంగ్రీ ఇది ఎక్కువగా స్వీట్ షాప్స్ లో దర్శనమిస్తుంది.దీన్ని మినపప్పుతో తయారుచేస్తారు.ఇక జాంగ్రీ,జిలేబి విషయంలో బాగా కన్ఫ్యూజ్ అయ్యే ఫ్రెండ్స్ తో ఈ ఆర్టికల్ ను షేర్ చేసుకోండి.


End of Article

You may also like