హీరో నితిన్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీని రాజు, గిరి నిర్మించారు. ఈ సినిమా విజయంతో ఈ మూవీ పేరు రాజు ఇంటి పేరుగా మారింది. అప్పటి నుండి దిల్ రాజు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ మూవీ 2003లో ఏప్రిల్ 4న విడుదల అయ్యింది. అంటే ఈ సినిమా విడుదల అయ్యి 20 ఏళ్ళు అవుతోంది. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

Video Advertisement

ఇక దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఎంట్రీ  ఇచ్చి ఇరవై ఏళ్ళు కావస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన విజయవంతంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ చిత్రం విడుదల అయ్యి 20 సంవత్సరాలు అవుతున్నా, ఆడియెన్స్ ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాని చూస్తూనే ఉన్నారు. కాగా, ఈ సినిమాలో నటించిన కొందరు యాక్టర్స్ ఇప్పుడు జీవించి లేకపోవడం బాధపెట్టే అంశం అని చెప్పవచ్చు. అయితే దిల్ చిత్రంలో నటించి, ప్రస్తుతం జీవించి లేని ఆ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
dil-movie-6-actors1. రాళ్ళపల్లి :
రాళ్ళపల్లి ఈ సినిమాలో టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ లో పనిచేసే పాత్రలో నటించారు. ఆయన కనిపించింది ఒక్క సన్నివేశంలో అయినప్పటికి తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. రాళ్ళపల్లి 2019 లో కన్నుమూశారు.
2. ఎం.ఎస్.నారాయణ :
ఎం.ఎస్.నారాయణ ఈ చిత్రంలో ప్రిన్సిపాల్ పుల్లారావుగా తన మార్క్ కామెడీతో నవ్వించారు. ఆయన 2015 లో కన్నుమూశారు.3. ఆహుతి ప్రసాద్ :
ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఆహుతి ప్రసాద్ 2015 లో మరణించారు.
4. వేణు మాధవ్ :
ఈ మూవీలో నితిన్ మావయ్య క్యారెక్టర్ లో నటించి, కామెడీ పండించారు. వేణు మాధవ్ ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ పాత్రలో అలరించాడు. వేణు మాధవ్ 2019 లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.5. చలపతి రావు :
సీనియర్ నటుడు చలపతి రావు ఈ సినిమాలో నితిన్ తండ్రి క్యారెక్టర్ లో నటించారు. చలపతి రావు 2022 డిసెంబర్ లో తుదిశ్వాస విడిచారు.6. రాజన్ పి.దేవ్ :
హీరోయిన్ కి తాతగా పవర్ ఫుల్ క్యారెక్టర్లో నటించారు. రాజన్ 2009 లో కన్నుమూశారు.Also Read: పుష్ప-2 “వేర్ ఈజ్ పుష్ప” వీడియోలో… ఈ 5 విషయాలని గమనించారా..?