అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా 20 సెకన్ల వీడియోను విడుదల చేశారు. కంప్లీట్ వీడియోను అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియో మూవీ పై ఆత్రుత కలిగేలా ఉంది.

Video Advertisement

తిరుపతి జైలులో నుండి బుల్లెట్ గాయంతో తప్పించుకున్న పుష్ప” అంటూ బ్యాగ్రౌండ్‌లో డైలాగ్ వినిపిస్తే, వేగంగా బైక్ పై ‘పుష్ప’ పారిపోతున్నట్లుగా చూపించారు. అనంతరం అల్లర్లు, పోలీసులను చూపించారు. అసలు పుష్ప ఎక్కడ? అంటూనే ‘హంట్ బిఫోర్ ద రూల్’ అని చూపించారు.

అల్లు అర్జున్ కనిపించకపోయిన ఈ వీడియోతో మూవీ పై ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ చిన్న గ్లింప్స్‌తోనే మూవీ పై అందరిలోనూ మరింతగా ఆసక్తిని పెంచారు. ఈ గ్లింప్స్‌తో ‘పుష్ప’ ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఈ మూవీ కథ గురించిన పలు విషయాలను చూపించారు.
1.ఈ వీడియోలో 2004 సంవత్సరం అన్నారు. కానీ సినిమా 1998లో జరిగినట్టు చూపించారు. అంటే ఈ చిత్రంలో ఆరు సంవత్సరాల తరువాత జరిగిన కథను చూపించబోతున్నారని అర్దం చేసుకోవచ్చు.2. ఈ వీడియోలో వర్షం సినిమా పోస్టర్ కనిపిస్తోంది. అది కూడా సినిమా రిలీజ్ అయిన మూడవ వారం అని కనిపిస్తోంది. వర్షం సినిమా 2004లో జనవరి 14న విడుదల అయ్యింది. దీనిని బట్టి చూస్తే పుష్ప 2 కథ ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తోంది.
3. ఈ గ్లింప్స్‌ లో వర్షం సినిమా మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్, పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ పోస్టర్స్ కూడా ఉన్నాయి. pushpa-2-glimps44. ఇందులో ప్రజలు పోలీసుల మీద పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే పుష్ప-2లో పోలీసులు అల్లు అర్జున్‌ను పట్టుకుంటారని, ఈ క్రమంలోనే ప్రజలు పుష్పను విడిపించడానికి పోలీసులకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మ కూడా కాల్చినట్లు చూపిస్తారు.
5.చివరిలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రను పుష్ప పార్ట్ -1 లో అవమానించడం తెలిసిందే. అందుకు పగ తీర్చుకోవడానికీ పుష్ప రాజ్ అరెస్ట్ చేశారా? పుష్ప బుల్లెట్ గాయంతో బైక్ పై తప్పించుకున్నట్లుగా చూపించారు. కానీ ఆ బైక్ పా వెళ్తున్న వ్యక్తి పుష్పరాజ్ కాదు కేశవలా అనిపిస్తున్నాడు.
watch video :

 

Also Read:“పవన్ కళ్యాణ్” నుండి… “ప్రభాస్” వరకు… IMDB ప్రకారం 10 “ఓవర్-రేటెడ్” తెలుగు హీరోలు వీరే..!