తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో ఎవరు? అంటే దానికి టక్కున సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత మంది హీరోలు మరో సినీ పరిశ్రమలో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వారే సపరేట్ ఫ్యాన్ బేస్ తో, సపరేట్ ఇమేజ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మన హీరోలు ఇప్పుడు ప్రపంచమంతా తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు.
Video Advertisement
అయితే ఇండియన్ సినిమా రేటింగ్స్ విషయంలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్)ది ప్రత్యేక స్థానం. ఏ సినిమాకి అయినా ఐఎండీబీలో పర్‌ఫెక్ట్ రేటింగ్ ఉంటుంది. అయితే ఐఎండీబీ రేటింగ్స్ ని బట్టి పలు నివేదికలు వెలువరిస్తుంది. అయితే తాజాగా టాలీవుడ్ హీరోల్లో ఓవర్ రేటెడ్ హీరోలు ఎవరో చెబుతూ ఒక లిస్ట్ ని రిలీజ్ చేసింది ఐఎండీబీ.
ఇప్పుడు ఆ లిస్ట్ లో ఏ ఏ హీరోలున్నారో ఇప్పుడు చూద్దాం..
#1 పవన్ కళ్యాణ్
సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కి ఉండే స్థానమే వేరు. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి.. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ని ఓవర్ రేటెడ్ హీరో అని పేర్కొంది ఐఎండీబీ.
#2 ప్రభాస్
బాహుబలి తో తెలుగు సినిమా ఖ్యాతి ఎంతో పెరిగింది. ఈ చిత్ర విజయం లో రాజమౌళి ది ఎంత పాత్ర ఉందో..ప్రభాస్ ది కూడా అంతే. కానీ ప్రభాస్ ని ఓవర్ రేటెడ్ హీరో అని చాలా మంది అన్నారు.
#3 నాగార్జున
అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు నాగార్జున. కానీ నాగ్ కి ఓవర్ రేటెడ్ హీరో టాగ్ ఉంది.
#4 సాయి ధరమ్ తేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఓవర్ రేటెడ్ అని ఐఎండీబీ పేర్కొంది.
#5 నాగ చైతన్య
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నాగ చైతన్య ఇప్పటికి ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
#6 మంచు విష్ణు
మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా ఓవర్ రేటెడ్ హీరో.
#7 కళ్యాణ్ రామ్
నందమూరి హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. కానీ ఇతడు కూడా ఐఎండీబీ ప్రకారం ఓవర్ రేటెడ్ హీరో.
#8 అఖిల్ అక్కినేని
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ఇప్పటికి ఒక సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
#9 నితిన్
హీరో నితిన్ కూడా ఐఎండీబీ ప్రకారం ఓవర్ రేటెడ్ హీరోనే.
#10 నవదీప్
కెరీర్ స్టార్టింగ్ లోనే వరుస విజయాలతో స్టార్ హీరో అయిన నవదీప్ ప్రస్తుతం మంచి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఐఎండీబీ ప్రకారం నవదీప్ ఓవర్ రేటెడ్ హీరో.