మహేష్ బాబు చాలా ప్రమాదకర వ్యక్తి అని కామెంట్ చేసిన దర్శకుడు.. వైరల్ అవుతున్న కామెంట్స్

మహేష్ బాబు చాలా ప్రమాదకర వ్యక్తి అని కామెంట్ చేసిన దర్శకుడు.. వైరల్ అవుతున్న కామెంట్స్

by kavitha

Ads

టాలీవుడ్‌లో ఈ తరం నటులలో అద్భుతంగా నటించేవారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. బాల నటుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన మహేష్, ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి సినిమాలు మహేష్ బాబు కెరీర్‌కి మలుపు తిప్పాయి.  ఆయన సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూసే స్థాయికి చేరాడు.

Video Advertisement

ఇండస్ట్రీలో మహేష్ కున్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. మహేష్ బాబుతో ‘ఒక్కడు’ వంటి ల్యాండ్ మార్క్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణ శేఖర్ మహేష్ బాబు పా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గుణ శేఖర్ తెరకెక్కించిన శాకుంతలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్  14న  రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుణశేఖర్ మహేష్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆయన మాట్లాడుతూ మహేష్ ఎంతో ప్రమాదకరమైన పర్సన్ అని, ఆయనతో ఒక్కసారి మూవీ చేస్తే, ఇంకో హీరోతో చేయాలనిపించదని అన్నారు. అంతలా మహేష్ మాయ చేస్తాడని, దాంతో మళ్లీ ఆయనతోనే మూవీ చేయాలని కోరుకుంటారని అన్నారు. అలా మహేష్‌ తో ఒక్కడు, సైనికుడు, అర్జున్ చిత్రాలను చేశానని తెలిపారు.ఈ విధంగా ఈ జనరేషన్ హీరోలలో ఒకే దర్శకుడితో వరుసగా 3 చిత్రాలు చేసిన హీరోని చూశారా అని అడిగారు. ఇక మహేష్‌తో మాత్రమే చిత్రాలు చేస్తే బాగుండదనే ఉద్దేశ్యంతో విరమం తీసుకున్నానని ఆయన తెలియచేసారు. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఈ నెల 14 న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మధుబాల కీలక పాత్రలలో నటించారు.Also Read: “రవి తేజ”తో జత కట్టిన ఈ 15 మంది హీరోయిన్స్ కి… రవి తేజకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?


End of Article

You may also like