Ads
టాలీవుడ్ లో ఉండే డైరెక్టర్ లో కృష్ణ వంశీ స్టైలే వేరు. ఈయన తీసిన చిత్రాలలో సమాజానికి మేలు చేసే అంశం ఉండాలని తపించే దర్శకుడు కృష్ణవంశీ. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గొప్ప సృజనాత్మక దర్శకుడుగా పేరు సంపాదించారు కృష్ణవంశీ.
Video Advertisement
2002 సంవత్సరంలో కృష్ణ వంశీ దర్శకత్వం లో దేశభక్తి కథాంశంగా తెరకెక్కిన ఖడ్గం మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. శ్రీకాంత్ రవితేజ ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషించగా. సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత హీరోయిన్స్ గా నటించారు.
పృథ్వీరాజ్, బ్రహ్మాజీ, ఉత్తేజ్, రఘుబాబు, షఫీ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రంలో నటన ద్వారా నటుల అందరికీ ఎంతో గుర్తింపు వచ్చింది. టెర్రరిజాన్ని ప్రధాన కథాంశంగా, పాతబస్తీలో జరుగుతున్నా తీవ్రవాద చర్యలు లో రూపు దిద్దుకున్న ఈ కథ అప్పట్లో ఎంతో దుమారం రేపింది. ఈ చిత్రంలో ముస్లింలను తీవ్రవాదులుగా సృష్టించారు అంటూ సినిమా విడుదలైన కొత్తలో ఎన్నో గొడవలు జరిగాయి. అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన థియేటర్లో పై దాడులు కూడా చేశారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత కృష్ణవంశీ ప్రాణ భయంతో కనిపించకుండా దాక్కున్నారు అనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి.
2017 నక్షత్రం చిత్రం తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం, అనసూయ,రాహుల్ సిప్లిగంజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మేకింగ్ వచ్చిన పలువురు ప్రముఖులు చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.
అయితే తాజాగా సోషల్ మీడియా ద్వారా కృష్ణవంశీకి ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో ఆ ప్రశ్న కాస్త వైరల్ గా మారింది. మీ నుంచి ఖడ్గం లాంటి మంచి చిత్రాన్ని ఆశిస్తున్నాము అంటూ నెటిజెన్ అడగగా.. ఇప్పుడు గాని నేను అలాంటి చిత్రం చేస్తే నన్ను చంపేస్తారేమో సార్ అంటూ జవాబు ఇచ్చారు కృష్ణవంశీ. ఈ రిప్లై కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఖడ్గం మూవీ విడుదల సమయంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా సమాధానం ఇచ్చి ఉంటారని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
End of Article