సినిమాల కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్న సృజనశీలి ప్రవీణ్ సత్తారు. దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా శిష్యరికం చేయకపోయినా, వెండితెరపై తనదైన ప్రతిభతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ‘ఎల్బీడబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న ఈ ఉత్తరాంధ్ర యువకుడు తన మూడో సినిమా ‘చందమామ కథలు’తో జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు.

Video Advertisement

తర్వాత గుంటూరు టాకీస్ చిత్రం చేసారు. ఆ తర్వాత రాజశేఖర్ తో చేసిన గరుడ వేగ చిత్రం తో సూపర్ హిట్ ను అందుకున్నారు ప్రవీణ్ సత్తార్. తాజాగా కింగ్ నాగార్జున, హీరోయిన్ గా సోనాల్ చౌహన్ తో ‘ది ఘోస్ట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు ప్రవీణ్. ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఈ సినిమా   ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ హీరోయిన్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

director praveen sattaru tells there is lack of heroins to act in action scenes..
‘గరుడ వేగ’ తరువాత మళ్లీ యాక్షన్ జోనర్లోనే చేద్దామనే ఉద్దేశంతో ‘ది ఘోస్ట్’ కథను లైన్లో పెట్టాను. నాగార్జున వంటి స్టార్ హీరోతో సినిమా చేయడం నాకు ఫస్ట్ టైమ్. స్క్రిప్ట్ వైపు నుంచి అన్ని రకాల సందేహాలకు తెరదించిన తరువాతనే నాగార్జునగారు రంగంలోకి దిగారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో హీరోయిన్ ఎంపిక అంత సులువుగా జరగలేదని ఆయన పేర్కొన్నారు.

director praveen sattaru tells there is lack of heroins to act in action scenes..
“యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు ఫస్ట్ కాజల్ ను ఎంపిక చేసాం. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో శృతిహాసన్, అమలపాల్, జాక్వెలిన్ వంటి హీరోయిన్లను సంప్రదించామని అయితే వీళ్లంతా బిజీగా ఉండటం వల్ల ఎవరు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. యాక్షన్స్ సన్ని వేశాల్లో నటించడం కోసం హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. చివరికి సోనాల్ చౌహన్ ఫైనల్ అయింది.” అని ప్రవీణ్ తెలిపారు.

director praveen sattaru tells there is lack of heroins to act in action scenes..

ప్రస్తుత కాలంలో యాక్షన్ సినిమాలకు డిమాండ్ పెరగడంతో హీరోయిన్లు కూడా యాక్షన్ సన్ని వేశాల్లో నటించడానికి సిద్ధం కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా డైరెక్టర్ వెల్లడించారు.

watch video: