రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. ఆయన సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక ట్వీట్ వేసినా, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారు. ఆ మధ్య పవన్ ఫాన్స్ తో ట్విట్టర్ వార్ చేసిన వర్మ. ఈ మధ్య లాక్ డౌన్ లో పలు సినిమా లు కూడా తీశారు, అవి పెద్దగా జనాలకి ఎక్కలేదనుకోండి అది వేరే విషయం. ఎన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా ఇంకా సినీ అభిమానులు ఆర్జీవీ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అదీ ఆయన ఫాలోయింగ్.

dear megha 1

మొన్నీమధ్యే హీరోయిన్ ఇనయా సుల్తానా తో ఆయన వేసిన డాన్స్ లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అంతలోనే “డియర్ మేఘ” మూవీ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ నెటిజన్లను సైతం షాక్ కి గురి చేసారు. డియర్ మేఘ హీరోయిన్ గురించి ఆయన ఓ రేంజ్ లో పొగిడేశారు. ఆ సినిమా హీరోయిన్ మేఘ ఆకాష్ పై రామ్ గోపాల్ వర్మ తన ఫీలింగ్స్ ను చెప్పేసారు.

dear megha 2

నలభై ఏళ్ల క్రితం మేఘ లాంటి అమ్మాయి నాకు కనిపించి ఉంటె.. కచ్చితం గా నేను డివోర్స్ తీసుకుని అయితే ఉండేవాడిని కాదు అంటూ చెప్పుకొచ్చారు. దానితో స్టేజి పైన అందరు షాక్ అయ్యారు. వర్మ అక్కడితో ఆగలేదు. మేఘ చాలా స్వీట్ పర్సన్ అని.. తనతో ఎవరైనా కాసేపు మాట్లాడినా వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

dear megha 3

వర్మ చేసిన కామెంట్స్ కి మేఘా ఆనందం మాములుగా లేదు. స్టేజి పైనే ఉబ్బి తబ్బిబయింది. ఇక హీరో ఆదిత్ గురించి ఎక్కువ గా పొగడలేను అంటూ ఆర్జీవీ సెటైర్ వేశారు. ఆదిత్ మంచి నటుడు అని.. త్వరలోనే అతనితో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. అంతకంటే ఎక్కువ పొగిడితే తనను తేడా అనుకుంటారు.. అంటూ సెటైర్ వేశారు.

Watch Video: