వెండితెర వెలుగు జిలుగులప్రపంచం వెనకాల వెలుగు చూడని మిస్టరీలు ఎన్నో..వడ్డించని జీవితంలోపల బయటి ప్రపంచానికి కనపడని విషాదాలెన్నో..సిని గ్లామర్ ప్రపంచంలో విషాదాంతం అయిన జీవితాలెన్నో అలాంటి వాటిల్లో ఉదయ్ కిరణ్ ది అందరిని కదిలించిన విషాదం..చిత్రం సినిమాతో టాలివుడ్ కి పరిచయం అయిన ఉదయ్ కిరణ్ మృతికి మెగాస్టార్ తో ముడిపెడతారు చాలామంది..ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు తేజ.
చిత్రం ,నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి తన అందం,నటనతో అమ్మాయిల హృదయంలో చాక్లెట్ బాయ్ గా గుర్తింపు పొందాడు నటుడు ఉదయ్ కిరణ్..అబ్బాయిలు కూడా ఉదయ్ ని, అమాయకమైన తన నటనని ఇష్టపడేవారు.ఇక పెద్దవాళ్లైతే వాళ్లింట్లో కుర్రాడిగానే ట్రీట్ చేసేవారు..అలాంటి ఉదయ్ కిరణ్ చిన్నవయసులో చనిపోవడంతో అందరూ బాధపడ్డారు.. అయ్యో అలా జరగకుండా ఉండాల్సింది అని అభిప్రాయాలు వెలిబుచ్చారు.. ఉదయ్ కిరణ్ చావుకి చిరంజీవికి ఎలాంటి సంబంధంలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు దర్శకుడు తేజ.
ఉదయ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది, తనకు ఎన్నో హిట్స్ అందించి స్టార్ హీరో స్థాయి కల్పించింది, తనకు అవకాశాలు లేనప్పుడు మళ్లీ అవకాశం ఇచ్చి హిట్ అందించింది కూడా తేజానే..తనతో ఉన్న పరిచయాన్ని బట్టి తన అభిప్రాయాన్ని చెప్పారు తేజా..“సూసైడ్ చేస్కోవడం అనేది ఇడియాటిక్ , మూర్ఖపు చర్య.. ఏం సాధించాడు చనిపోవడం వలన..అవకాశాలు లేక చనిపోయాడా అంటే, అతను చనిపోయే నాటికి అవకాశాలు లేక చాలా కాలం అయింది, అప్పటికి అలవాటై పోయుండాలి..నాకు పరిచయం ఉన్న ఉదయ్ వరకు అతను అవకాశాలు లేకనో, మరే కారణం చేతనో సూసైడ్ చేసుకునే రకం కాదు. అందరూ అనుకునట్టుగా చిరంజీవికి, ఉదయ్ కిరణ్ చావుకి ఎలాంటి సంబంధం లేదు.. ఇంకేదో జరిగింది , అదేంటి అనేది ఎవరికి తెలీదు..”అని అన్నారు.
చిన్న వయసులోనే హీరోగా పరిచయం, హ్యాట్రిక్ విజయాలతో స్టార్ డమ్ అనుభవించడం, తర్వాత అవకాశాల రాక, సినిమాలు లేక అర్దాంతరంగా తన జీవితాన్ని తనే బలవంతంగా చిదిమేసుకొని ఒక విషాద ముగింపు ఇచ్చుకోవడంతో ఉదయ్ కిరణ్ కథ అలా ముగిసిపోయింది.కేవలం ఉదయ్ మాత్రమే కాదు అర్దాంతరంగా ముగిసిపోయిన ఎందరో నటుల జీవితాలు..నిజాలేంటో తెలియకుండానే చీకట్లో కలిసిపోయాయి.
watch video: