గత కొంత కాలంగా పరిస్థితులు చూస్తుంటే తెలుగు సినీ ప్రేక్షకుల టేస్ట్ మారిందని తెలుస్తోంది. ఇదివరకటిలాగా మూస సినిమాలను, రొటీన్ సినిమాలను వారు ఎంకరేజ్ చేయడం లేదు. వారి అభిమాన హీరో అయినా ఆ చిత్రాలను పక్కన పెట్టేస్తున్నారు.
ఈ నేపథ్యం లో టాలీవుడ్ బడా డైరెక్టర్ వివి వినాయక గత కొంత కాలం గా సైలెంట్ గా ఉంటున్నారు. నిజానికి వీవీ వినాయక్ అఖిల్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నా ఇంటిలిజెంట్ అనే సినిమాతో మరో డిజాస్టర్ అందుకుని ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.

Video Advertisement

vv vinayak new movie update..
ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు అని ప్రకటించారు. కానీ దానిపై ఇప్పటివరకు దానిపై అప్డేట్ లేదు.
తాజాగా ‘చెన్న కేశవ రెడ్డి ‘ చిత్ర రీ రిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లం కొండ సురేష్ ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు.

vv vinayak new movie update..
”ఛ‌త్ర‌ప‌తి డ‌బుల్ పాజిటీవ్ చూసిన‌… పెన్ స్టూడియోస్ నిర్మాత‌లు చాలా ఇంప్రెస్ అయ్యారు. వినాయ‌క్ తో మ‌రో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చారు. ఏకంగా రూ.500 కోట్ల బ‌డ్జెట్ తో సినిమా తీస్తామ‌న్నారు. వాళ్ల‌తో క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి” అని క్లారిటీ ఇచ్చారు.

vv vinayak new movie update..హిందీ ఛ‌త్ర‌ప‌తికి సంబంధించిన అప్ డేట్ కూడా ఆయన వెల్లడించారు. ”ఛ‌త్ర‌ప‌తి షూటింగ్ పూర్త‌య్యింది. హీరోయిన్ డేట్ల విష‌యంలో ఇబ్బందులు రావ‌డం వ‌ల్ల సినిమా ఆల‌స్య‌మైంది. లేక‌పోతే ముందే పూర్త‌యిపోయేది. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నులు ముంబైలో జ‌రుగుతున్నాయి. సీజీ కోసం మూడు నెల‌లు కేటాయించాలి. ఛ‌త్ర‌ప‌తితో పోలిస్తే.. హిందీలో యాక్ష‌న్ డోసు ఎక్కువ‌గా ఉంటుంది. అయినా స‌రే.. వినాయ‌క్ 80 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేసారు” అని బెల్లం కొండ సురేష్ తెలిపారు.

vv vinayak new movie update..

అయితే తెలుగు లో చాలా కాలంగా సరైన హిట్ లేని వివి వినాయక్ తో 500 కోట్ల సినిమానా.. అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరో వైపు వినాయక్ తానే హీరోగా మరో సినిమా పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. గతం లో కూడా ‘శీనయ్య’ మూవీ ని ప్రకటించారు వినాయక్. కానీ అది ఇప్పటి వరకు బయటకు రాలేదు.