ప్రస్తుతం టాలీవుడ్ లో యువ దర్శకుల హోరు వినిపిస్తోంది. ఈ యువ దర్శకులు తొలిప్రయత్నం లోనే తమ ముద్రని చూపిస్తున్నారు. ఇండస్ట్రీ లో ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడం అనేది ప్రతి డైరెక్టర్ కి ఛాలెంజ్ లాంటిది. ఆ సినిమా వారి భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే చాలా మంది తమ ఫస్ట్ మూవీస్ తో సెన్సేషనల్ హిట్స్ తీశారు.
Video Advertisement
అయితే ప్రతి దర్శకుడు ఏదోక సినిమాకి పని చేసి అనుభవాన్ని సంపాదించిన వాళ్లే. వీరిలో చాలా మంది పలువురు స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్స్ గా పని చేసారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..
#1 సుకుమార్ – వి వి వినాయక్
మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ దగ్గర దిల్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.
#2 వంశి పైడిపల్లి – బోయపాటి శ్రీను
ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న వంశి పైడిపల్లి.. భద్ర మూవీ కి బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు.
#3 నాగ్ అశ్విన్ – శేఖర్ కమ్ముల
మహానటి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్.. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రానికి శేఖర్ కమ్ముల వద్ద పని చేసారు.
#4 వెంకీ కుడుముల – త్రివిక్రమ్
చలో, భీష్మ వంటి హిట్ చిత్రాలు తీసిన వెంకీ కుడుముల త్రివిక్రమ్ దగ్గర అ ఆ మూవీ కి అసోసియేట్ గా పనిచేసారు.
#5 అనిల్ రావిపూడి – శ్రీను వైట్ల
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్ వంటి డైరెక్టర్స్ వద్ద పని చేసారు.
#6 హను రాఘవపూడి – చంద్రశేఖర్ యేలేటి
విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి.. చంద్రశేఖర్ యేలేటి వద్ద అనుకోకుండా ఒకరోజు మూవీ కి పని చేసారు.
#7 సందీప్ రెడ్డి వంగ – కిరణ్ కుమార్ రెడ్డి
నాగార్జున హీరో గా వచ్చిన కేడీ మూవీ కి దర్శకుడు కిరణ్ కుమార్ వద్ద సందీప్ రెడ్డి వంగ పని చేసారు. ఈ మూవీ లో కామియో గా కూడా కనిపించాడు సందీప్ రెడ్డి వంగ.
#8 బుచ్చి బాబు – సుకుమార్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులు ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. ఇలా వచ్చి ఉప్పెన చిత్రం తో సూపర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సానా.
#9 సతీష్ వేగేశ్న – హరీష్ శంకర్
దర్శకుడు హరీష్ శంకర్ వద్ద గబ్బర్ సింగ్ చిత్రానికి గాను సతీష్ వేగేశ్న అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు.
#10 శ్రీకాంత్ ఓదెల – సుకుమార్
సుకుమార్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా నాని తో దసరా మూవీ తో హిట్ కొట్టాడు.
#11 బాబీ
ఇటీవల వాల్తేరు వీరయ్యతో చాలా పెద్ద పేరు సంపాదించుకున్న డైరెక్టర్ బాబీ కూడా అంతకు ముందు డాన్ శీను, ఓ మై ఫ్రెండ్, బాడీగార్డ్, బలుపు, అల్లుడు శీను సినిమాలకి అసిస్టెంట్ గా చేశారు.
#12 పల్నాటి సూర్య ప్రతాప్ – సుకుమార్
సుకుమార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన పల్నాటి సూర్య ప్రతాప్ కుమారి 21 F , 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలు తీశారు.