Ads
హిందూ సంప్రదాయంలో నలుపు అశుభానికి ప్రతీకగా చూస్తారు. అయితే కొందరి దృష్టి పడకుండా ఉండడానికి నలుపు రంగును ఉపయోగిస్తారు. శుభకార్యాలలో కూడా నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకూడదని అంటుంటారు. ఎవరి కైనా పెట్టె వస్త్రాలు కూడా నలుపురంగులో ఉండకుండా జాగ్రత్త పడుతుంటారు.
Video Advertisement
సాధారణంగా నలుపు రంగు పై ఎక్కువగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. దాంతో వీలైనంత వరకు నలుపును దూరం పెడుతుంటారు. మరి నలుపు రంగు దుస్తులను ఎందుకు ధరించకూడదో ? ధరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
సంప్రదాయ ప్రకారంగా నలుపు రంగును కీడును శంకించే రంగుగా భావిస్తారు. నల్లని రంగు శని దేవుడికి ప్రీతికరమైన రంగు, కాబట్టి నల్లటి బట్టలు వేసుకోకూదని కొందరు చెబుతారు. సైన్స్ ప్రకారం చూసినట్లయితే నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల ఎండలో వెళ్ళినపుడు నలుపు రంగు దుస్తులు వేసుకుని వెళ్లీనట్లయితే అవి వేడిని ఎక్కువ గ్రహించడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దాంతో శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురి అవుతారు. అందుకే ఎండకాలంలో బయటికి వెళ్ళేప్పుడు నల్లటి బట్టలను వేసుకోవద్దు అని అంటారు.
సద్గురు నలుపు రంగు బట్టలు ఎందుకు ధరించకూడదనే విషయం గురించి ఈ విధంగా వివరించారు. ‘నలుపు ప్రతి దాన్ని గ్రహిస్తుంది. మీ చుట్టూ ఉన్న దానిని గ్రహించాలి అనుకునేటువంటి ప్రదేశంలో మీరు ఉన్నప్పుడు నల్లని రంగు బట్టలను ధరించాలి. అయితే మీ చుట్టూ ఏదైతే ఉందో దానిని మీరు గ్రహించవద్దు అనుకునేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు వేసుకున్నట్లు అయితే మీరు అక్కడ ఉన్న రకరకాల విషయాలను గ్రహించడం మొదలు పెడతారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్న మానసిక ఘర్షణలు దాదాపుగా ఇరవై, ఇరవై ఐదు శాతం ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలా ఎక్కువ సమయాలు అన్నీ రకాల పరిస్థితుల్లో నల్ల దుస్తుల్లో ఉండిపోవడం వల్ల, అలాంటి చోట్ల అలా ఉండకూడదు’ అని సద్గురు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియోను చూడండి.
watch video:
Also Read: మన గత జన్మకి సంబంధించిన గుర్తులు ఎలా ఉంటాయి..? ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారు..?
End of Article