చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు.

Video Advertisement

వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అలానే చాణక్య జీవితంలో ఈ విషయంలో అసంతృప్తి ఉంటే కూడా మంచిది అని అన్నారు. మరి జీవితం లో ఏ విషయం లో అసంతృప్తి ఉండడం మంచిది అనేది చూద్దాం.

ఆచార్య చాణక్య ఈ విషయంలో అసంతృప్తి ఉంటే మంచిదని అన్నారు. నిజానికి ప్రతి ఒక్క పని చేసి మనిషి తృప్తి పడాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ విషయాల్లో మాత్రం అసంతృప్తి ఉన్నా పరవాలేదని చాణక్య చెప్పారు. అసంతృప్తి ఉండడం వలన మనిషి మరింత కష్టపడతాడు. జీవితంలో ముందుకు వెళ్లడానికి అసంతృప్తి సహాయపడుతుంది.

#1. విద్యా, జ్ఞానం పట్ల మనిషికి అసంతృప్తి ఉంటే చాలా మంచితని.. విద్యా, జ్ఞానం వంటి వాటిలో అసంతృప్తి చాలా అవసరమని అన్నారు.
#2. అలానే దానం చేయడంలో.. సహాయం చేయడంలో మనిషికి అసంతృప్తి ఉంటే మంచిదని ఇలా అసంతృప్తి వీటిల్లో ఉండడం వలన ఇంకొంత మందికి మనిషి సహాయం చేయగలడని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.
#3. దేవుడిని పూజించడంలో, స్మరించడంలో అసంతృప్తి ఉంటే చాలా మంచిదని దీని వలన భగవంతుడిని మరింత ప్రార్థిస్తారని ఆచార్య చాణక్య అన్నారు.