చెయ్యి కాలింది అని టూత్ పేస్ట్ ని పెట్టింది.. ఆ తరువాత ఏమి జరిగిందో తెలిస్తే మైండ్ బ్లాక్..!

చెయ్యి కాలింది అని టూత్ పేస్ట్ ని పెట్టింది.. ఆ తరువాత ఏమి జరిగిందో తెలిస్తే మైండ్ బ్లాక్..!

by Megha Varna

Ads

ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఇంటి చిట్కాలని చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా గాయాలు లాంటివి వచ్చినప్పుడు వివిధ రకాల హోం రెమడీస్ ని ఫాలో అవ్వడం చాలా మందికి అలవాటు. అయితే ఒక్కొక సారి మనం ఉపయోగించే పద్ధతులు మన మీద తిరగబడే అవకాశం వుంది.

Video Advertisement

 

దీంతో సమస్య మరింత పెద్దదవుతుంది. అలానే ప్రమాదంగా కూడా మారే అవకాశం ఉంటుంది. అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మరి దాని కోసం పూర్తి వివరాలను చూస్తే….

మలేషియా కి చెందిన జిగాబో అనే ఒక ఆవిడ ఏదో పని చేస్తూ ఉంటే చెయ్యి కాస్త కాలింది. కొంచమే కదా కాలింది ఆసుపత్రికి వెళ్లడం ఎందుకు అని ఆమె తన ఇంట్లో ఉన్న టూత్ పేస్ట్ ను తీసి ఆ కాలం గాయంపై రాసింది. ఇదే పద్ధతిని ఆమె రెండు రోజుల పాటు చేసింది. మూడో రోజు గాయంపై మళ్లీ పేస్ట్ నిపెట్టింది. అయితే వెంటనే రివర్స్ యాక్షన్ జరిగింది.

Urgent Care: How to Make a Burn Stop Hurting

గాయం మానలేదు సరికదా చెయ్యంతా వాచిపోయింది. చేయి చూడడానికి ఒక రబ్బర్ బెలూన్ లాగ తయారైపోయింది. బాగా ఎక్కువగా వాయడంతో ఆసుపత్రికి వెళ్ళింది. ఆమె చెయ్యి తిరిగి మళ్ళీ బాగవుతుందా అనే సందేహం కలిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. చెయ్యి బాగా ఇన్ఫెక్షన్ అయ్యిందని వెంటనే ఆ చేతిని క్లీన్ చేశారు. అలానే యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కాలిన ప్రాంతం లో చిన్న ఆపరేషన్ కూడా చేసారు.

నిజంగా వారం రోజుల పాటు నరకం చూసిందామె. అందుకనే చిన్న సమస్య అని నచ్చినట్లు ఇంటి చిట్కాలని అనుసరిస్తే తప్పక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఇంట్లో చికిత్స చేసుకునే ఆలోచన తీసుకురావద్దని డాక్టర్ అన్నారు. ఆ చేయి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజంగా దానిని చూస్తే ఎవరు టూత్ పేస్ట్ ని కాలిన గాయాల మీద ఇంక అప్లై చేయరు.

https://telugustop.com/should-never-use-tooth-paste-to-soothe-burns-1/


End of Article

You may also like